Tuesday, November 15, 2016

తృప్తిం జెందని మనుజుడు


తృప్తిం జెందని మనుజుడు




సాహితీమిత్రులారా!


తృప్తిం జెందని మనుజుడు
సప్తద్వీపంబుల చొక్కంబడునే
- అని భాగవతసూక్తి.
తృప్తిలేని వానికి సప్తద్వీపాలిచ్చినా
వానికి తృప్తి కలగదట.
అలాంటిదే ఈ శ్లోకం చూడండి-
భర్తృహరి వైరాగ్యశతకంలోనిది-

ఉత్ఖాతం నిధిశఙ్కయా క్షితితలం, ధ్మాతా గిరేర్ధాతవో,
నిస్తీర్ణస్సరితాంపతి, ర్నృపతయో యత్నేన సంతోషితా:,
మన్త్రారాధనతత్పరేణ మనసా నీతా: శ్మశానే నిశా:
ప్రాప్త: కాణవ రాటకోపి న మయా తృష్ణే సకామా భవ


నిధి నిక్షేపాలను పూర్వీకులెవరో దాచి
ఉంచుతారని విని ఆశగా నేల చెడత్రవ్వాను.
బంగారం మీది వ్యామోహంతో కొండలమీద
లభ్యమయ్యే మణిశిల వంటి ధాతువుల్ని కరిగించాను.
ఎక్కడో దూరదేశాల్లో సంపదలున్నాయంటే ఆత్రంగా
సముద్రాల మీదికి ప్రయాసతో ప్రయాణించి,
రాజుల కొలువుచేసి వార్నికనిపెట్టి
సదా ఇష్టుడిగా మెలిగాను.
మంత్రాలతో ఎక్కడెక్కడి
ఐశ్వర్యాలూ వశమౌతాయని
ఆశించి రాత్రులెన్నో
శ్మశానాల్లో గడిపాను.
ఏది గుడ్డిగవ్వయినా
దొరికిందా?
ఈ తపన ఇంకా చాల్లే - అని భావం.

No comments:

Post a Comment