Friday, November 11, 2016

సిగ్గును మొదవంగ కన్నులు మోడ్చుకొనును


సిగ్గును మొదవంగ కన్నులు మోడ్చుకొనును




సాహితీమిత్రులారా!


ప్రౌఢదేవరాయలు ఒకసారి శ్రీనాథుని
బాల, ప్రౌఢ, లోల - వీరినిగురించి
పద్యాలు చెప్పమన్నారట. మన పరిశోధకులకు కేవలం
బాలనుగురించిన చెప్పిన పద్యం మాత్రమే దొరికిందట.
ఆ పద్యం-

కమనీయ కరపల్లవము మేను గదియంగ 
         నొయ్యన చాచిన నులికిపడును
ఆలింగనమునకు నక్కున జేర్చిన 
         చేదోయి యురమున చేర్చుకొనును
చుంబనమ్మున కోష్ఠబింబమ్ము గమకింప
         వదనమొయ్య నొకింత వంచుకొనును
గిలిగింత సేతకు కినుకయు, సిగ్గును
         మొదవంగ కన్నులు మోడ్చుకొనును
అట్టి బాల రతిక్రీడ ననువు పరుప
నేర్పు గల్గునె పరులకు నీకుగాక
రాజ పరమేశ రాజాధిరాజ విభవ
లక్షణోపేంద్ర ప్రౌఢరాయక్షితీంద్ర!

బాల, ప్రౌఢ, లోల - అనేవి
శృంగారంలో వారికిగల నేర్పును బట్టి
వారికి పెట్టిన పేర్లు. ఇందులో బాల అతి
తక్కువ శృంగారానుభవంగలది.
అటువంటి వారిని దారికి తెచ్చుకోవడం
నీకుగాక మరొకరికి సాధ్యంకాదని
ప్రౌఢరాయలను సంబోధంచారు కవిగారు.


No comments:

Post a Comment