Friday, November 18, 2016

ఎంత ధర్మాత్ముడు ధర్మరాజు


ఎంత ధర్మాత్ముడు ధర్మరాజు
సాహితీమిత్రులారా!పాండవులు అరణ్యవాసం పూర్తి కాబోయే సమయంలో
పాండవులలో ధర్మరాజు తప్పమిగిలినవారు అందరూ
ఒక సరస్సులో నీరు త్రాగవద్దని చెప్పినా ఆ నీరు త్రాగి
మరణిస్తారు. ధర్మరాజు వారిని వెతుక్కుంటూ వచ్చి
విగతజీవులైన తమ్ములను చూచి విచారిస్తాడు.
ఆ సమయంలో ఆ సరస్సు నీరు త్రాగటానికి
ధర్మరాజు ప్రయత్నించగా తన తమ్ములకు చెప్పిన
విధంగానే ఒక అశరీరవాణి నీరు త్రాగవద్దని, నామాట
వినకుండా మీతమ్ములు త్రాగి మరణించారని చెబుతూ
తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే నీరు త్రాగవచ్చు
నీ తమ్ములలో  ఒకరిని బ్రతికించుకోవచ్చని చెబుతుంది.
ధర్మరాజు సరేనని అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానాలిచ్చి
తృప్తి పరుస్తాడు. అప్పుడు నీతమ్ములలో
ఎవరిని బ్రతికించాలని అడగ్గా
నకులుని బ్రతికించమంటాడు.
అది అలా ఎందుకు కోరుకున్నావు
భీమార్జునులు ఉండగా
నకులుని ఎందుకు కోరుకున్నావు అని అడిగితే
ఈ విధంగా చెప్పాడు-

కుంతీ చైవతు మాద్రీచ
ద్వే భార్యేతు పితుర్మమ
ఉభే సపుత్రే స్యాతాంవై
ఇతి మే ధీయతే మతి:
                                         (మహాభారతం - యక్షప్రశ్నలు)

నాతండ్రికి "కుంతి", "మాద్రి" ఇద్దరు భార్యలు.
ఇద్దరికి సమానంగా కొడుకులు మిగులుగాక.
కుంతీపుత్రుడను నేను బ్రతికి ఉన్నట్లే
మాద్రి పెద్దకుమారుడు నకులుడు జీవించుగాక
- అని సమాధానమిచ్చాడు.

ఎంతటి ధర్మం.
ఇలాంటి అన్నలు ఈ కాలంలో ఉన్నారా?
ఏమో మరి.

No comments:

Post a Comment