Sunday, May 7, 2017

సారపుధర్మమున్ విమల సత్యము


సారపుధర్మమున్ విమల సత్యము




సాహితీమిత్రులారా!



తెలుగువారు క్లిష్టసమయాల్లో భగవంతుడు
వాటిని చక్కదిద్దటాని వస్తాడు
అని చెప్పటానివాడే పద్యం ఇది-

శ్రీకృష్ణుడు పాండవదూతగా కౌరవసభకు
వెళ్లినపుడు ధృతరాష్ట్రునితో పలికిన
పలుకులలోని ఒక పద్యం ఇది-

సారపుధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచేఁ
బారముబొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు
లెవ్వారలుపేక్ష సేసిరది వారల చేటగుగాని ధర్మ ని
స్తారక మయ్యు సత్యశుభదాయమయ్యును దైవముండె డున్
                                                                      (శ్రీమదాంధ్రమహాభారతము - 5 - 273)



ఈ పద్యం పాండవదూతగా
కురుసభలో కృష్ణుడు చెబుతున్నది.
ఉత్తమమైన ధర్మం
నిర్మలమైన సత్యం
పాపముచేతను, అబద్ధంచేతను,
దరిచేరలేక చెడటానికి సిద్ధంగా
ఉన్నసమయంలో వాటిని రక్షించే శక్తి
ఉన్నా ఎవరు అడ్డుపడక ఉపేక్షిస్తారో
అది వారికే చేటవుతుంది
ఆ స్థితిలో భర్మరక్షణకు
సత్యానికి శుభంకలిగించటానికి
భగవంతుడు వస్తాడు-
అని భావం.

No comments:

Post a Comment