Wednesday, May 3, 2017

క్షీరసాగర మథనం (అంతరార్థం)


క్షీరసాగర మథనం (అంతరార్థం)



సాహితీమిత్రులారా!


గణపతివాశిష్ఠముని కృత
ఉమాసహస్రంలోని 1వ స్తబకములో
వివరించబడిన అమృత మథన
అంతరార్థం రెండు శ్లోకాలలో కలదు అవి-

ప్రాణిశరీరం మన్దరశైలొ
మూలసరోజం కచ్ఛపరాజః
పూర్ణమనన్తం క్షీర సముద్రః
పృష్ఠగవీణా వాసుకురజ్జుః

ప్రాణిశరీరం - మందర పర్వతం
మూలాధార కమలము - కచ్ఛపరాజు(కూర్మరాజు)
పూర్ణమగు ఆకాశము -
దహరము అను హృదయము క్షీరసముద్రము
వెన్నెముకగల వీణాదండము -వాసుకి యగు త్రాడు

దక్షిణనాడీ - నిర్జరసేనా
వామగనాడీ - దానవసేనా
శక్తివిలాసో - మన్ధనకృత్యం
శీర్షజధారా - కా2పిసుధోక్తా

దక్షిణనాడి - దేవసేన
వామగనాడి - అసుర సేన
శక్తివిలాసము - మన్ధనకృత్యము
శీర్షజమను నొకానొక ధార - అమృతము.

శరీరము మధ్యనున్న సుషుమ్నా నాడికి అపసవ్యమున ఉన్న
పింగళ అను పేరుగలనాడి దక్షిణనాడి - దేవతలసేన అగుచున్నది
ఆ సుషుమ్నకు సవ్యభాగమున ఉన్న ఇల లేక ఇడా అనే నాడి
వామగ నాడి - ఇది అసురసేన అగుచున్నది. శక్తి యొక్క క్రీడయే
మధనమను కార్యము అగుచున్నది.
సహస్రారకమలమునుండి వెలువడిన అనిర్వచనీయమైన
ఆనందధారయే అమృతము - అని చెప్పబడుచున్నది.

No comments:

Post a Comment