ఆ విషయం కలిమిలేములే నిర్ణయిస్తాయి
సాహితీమిత్రులారా!
లోకంలోని ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది.
అది మన దగ్గరున్న సంపదను బట్టి ఉంటుంది.
అదే విషయాన్ని తెలిపే ఈ శ్లోకం చూడండి-
ఇది భర్తృహరి నీతిశతకంలోనిది.
పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే
స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం
అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా
మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ
ఇ ది ఎంత చిత్రమైనదంటే ---------
ఒకప్పుడు ఆపత్కాలంలో
అతి సామాన్యమైనవస్తువే
పెన్నిధిగా తోచవచ్చు
అదే వస్తువుసంపదలొచ్చిన వేళ
అల్పంగా అనిపించ వచ్చు
ఉదాహరణకు - దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు
గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు
కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు
భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు
సమయాన్ని బట్టి- ఒకప్పుడు అధికమైనది
మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా
తోచడం జరుగుతుంది.
No comments:
Post a Comment