నూరువురు వైద్యులు కూడివచ్చినా.....
సాహితీమిత్రులారా!
నూరువురు వైద్యులు కూడివచ్చినా
దైవనిర్ణయం మారదు ఏది జరగాలో
అదే జరుగుతుంది -
ఈ విషయాన్ని తెలిపే భర్తృహరి
సుభాషిత పద్యం చూడండి-
శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ
తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా
పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా
హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే
శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు.
చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే
నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం.
అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు.
ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి
తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా
దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ
సాధ్యంకాదు - అని దీనిభావం.
No comments:
Post a Comment