అనాథ
సాహితీమిత్రులారా!
జాషువా, అనాథ అనే ఖండకావ్యంలో
దోపిడీ వ్యవస్థకు గురిచేయబడిన అనాథ
దయనీయమైన స్థితిని మన కళ్లకు కట్టాడు
ఈ పద్యంలో చూడండి-
ఎవఁడారగించు నమృత భోజనంబునఁ
గలిసెనో యీ లేమ గంజిబువ్వ
ఎవఁడు వాసముసేయు శృంగార సౌధాన
మునిఁగెనో యిన్నారి పూరిగుడిసె
ఎవని దేహము మీఁది ధవళాంబురములలోఁ
బొసఁగెనో యిన్నాతి ముదుక పంచె
ఎవఁడు దేహము సేర్చు మృదు తల్పములలోన
నక్కెనో యీ యమ్మ కుక్కిపడక
వసుధపై నున్న భోగ సర్వస్వమునకు
స్వామిక వహించి మనుజుండు ప్రభవ మందు
నెవఁ డపహసించె నేమయ్యె నీమె సుఖము
కలుష మెఱుఁగని దీని కొడుకుల సుఖంబు
(అనాథ - 60)
ఈ విధంగా తాడిత పీడిత వర్గానికి ప్రతినిధి అయి
ఒక అనాథ హృదయవిదారకమైన అర్థాంతరపు బ్రతుకునకు
సమగ్రాకృతి కల్పించాడు జాషువాగారు.
ఇది 1924లో ముద్రణ జరిగినది కాని నేటికి వీనిలోని
కొన్ని దృశ్యాలు మనకంటికి కనిపించే సార్వకాలీనమైన
విషయాన్ని ప్రస్తావించాడు ఇందులో. అందుకే అంటారు
కవి క్రాంతదర్శి అని.
No comments:
Post a Comment