ఇవి లేనిది ఎంత మేధ పనికిరాదు
సాహితీమిత్రులారా!
ఇది విద్యార్థులకు సంబంధించి
పెద్దలు చెప్పిన శ్లోకం -
ఆస్థా స్వాస్థ్యే యదిస్యాతాం
మేధయా కిం ప్రయోజనమ్?
తావుభౌ యది నస్యాతాం
మేధయా కిం ప్రయోజనమ్?
విద్య కావాలనే కాంక్ష,
ఆరోగ్యం ఉంటే మేధాశక్తి
అవసరంలేకుండా విద్యావంతుడు
కాగలడు విద్యార్థి. ఈ రెండు లేని
మేధస్సు ఎంత ఉన్నా ప్రయోజనం లేదు-
అని భావం.
No comments:
Post a Comment