అస్త్రాలు - ప్రత్యస్త్రాలు
సాహితీమిత్రులారా!
ఏదాన్లోనైనా చర్యకు ప్రతిచర్య ఉంటేనే అది రక్తి కడుతుంది.
అలాగే యుద్ధంలో నాయకుడు ప్రతినాయకుడు ఉంటారుకదా
నాయకుడు వేసేది అస్త్రమైతే ప్రతినాయకుడు వేసేది ప్రత్యస్త్రం.
ప్రతినాయకు వేసేది అస్త్రమైతే నాయకుడు వేసేది ప్రత్యస్త్రం.
ఇక్కడ రామాయణంలో రామలక్ష్మణులకు రాక్షసులకు జరిగిన
యుద్ధంలో అస్త్ర ప్రత్యస్త్రాలను గురించి కొన్నిటిని చూద్దాం-
అస్త్రాలు ప్రత్యస్త్రాలు
లక్ష్మణుడు అతికాయుడు
అగ్నిబాణం సూర్యబాణం
ఆగ్నేయాస్త్రం సూర్యాస్త్రం
ఐంద్రాస్త్రం ఐషీకాస్త్రం
వాయవ్యాస్త్రం యమాస్త్రం
లక్మణుడు ఇంద్రజిత్
వారుణాస్త్రం రౌద్రాస్త్రం
పౌరాస్త్రం ఆగ్నేయాస్త్రం
మహేశ్వరాస్త్రం అసురాస్త్రం
శ్రీరాముడు రావణుడు
ఆగ్నేయాస్త్రం రౌద్రాస్త్రం
గంధర్వాస్త్రం సౌరాస్త్రం
గంధర్వాస్త్రం గంధర్వాస్త్రం
దైవాస్త్రం దైవాస్త్రం
గారుడాస్త్రం రాక్షసాస్త్రం
మహాశక్త్యాయుధం మహాశూలం
ఇలా ఒకరిని మించి ఒకరు ఆయుధప్రయోగాలు చేశారు.
No comments:
Post a Comment