Saturday, February 4, 2017

ఇవిలేని చోట ఒక్కరోజు కూడ ఉండకూడదు


ఇవిలేని చోట ఒక్కరోజు కూడ ఉండకూడదు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః
పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివసం వసేత్
                                                                                (చాణక్య నీతి దర్పణమ్)
ధనవంతుడు, వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు,
ధార్మికుడైన న్యాయశీలుడైన రాజు,
వ్యవసాయమునకు ఉపయోగించు నది,
ఐదవ వాడైన వైద్యుడు అనే ఈ ఐదు లేనిచోట
ఒక్కరోజుకూడ ఉండకూడదని - భావం.

ఈ శ్లోకం వింటూనే మనకు
సుమతి శతకంలోని ఈ పద్యం
గుర్తుకు వస్తుంది కదా!

అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేఱును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడ కున్నట్టి యూర చొఱకుము సుమతీ!

No comments:

Post a Comment