Thursday, February 2, 2017

వ్యాధులకున్ మహౌషధుల్


వ్యాధులకున్ మహౌషధుల్




సాహితీమిత్రులారా!


నవ్వే ఒక భోగం
నవ్వకపోతే రోగం
అంటూంటారుకదా!
నవ్వువలన ఎంటి ఉపయోగం ఉందో
జాషువాగారి ఈ పద్యంలో చూడండి-


నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తి కిన్
దివ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్త ముల్,
పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైనవే
నవ్వులు, సర్వ దుఃఖ శమంబులు, వ్యాధులకున్ మహౌ షధుల్


నవ్వును జంతువులు నవ్వలేవు
మనుషులుమాత్రమే నవ్వగలరు
నవ్వులు మనిషి మానసికప్రవృత్తికి దీపాలు
కొన్ని నవ్వులు ఇది అని తేల్చవీలుగాదు
కొన్ని నవ్వులు విషంతో నిండి ఉంటాయి
పువ్వులవలె ప్రేమరసాన్ని
వెలిగ్రక్కేంత స్వచ్ఛమైనవే నవ్వులు
(మిగిలినవి కావని)
అన్ని బాధలకు ఉపశమననాన్నిచ్చేవి నవ్వులు
గొప్పవ్యాధులకు కూడ మహా ఔషం నవ్వే- అని భావం

ఈ పద్యంలోనే నవ్వును గురించి
ఎంత చక్కగా విశదరచాడో కదా!

No comments:

Post a Comment