వీరు ఉపన్యాసకులా?
సాహితీమిత్రులారా!
ఉపన్యసించడం కొందరికి ఇష్టముండదు
ఉపన్యాసములను ఇచ్చుట కొందరికి పిచ్చి.
ఇలాంటివారిలో కొందరు అతి భయంకరమైన
స్థాయిలో తమ ఉపన్యాసాలను సాగిస్తారు
వారిని గురించి ఒక కవి చెప్పిన పద్యం -
"గొడవగా నున్నారు కూర్చుందునా?" యని
కూర్చుండ డిదియేమి గొడవవచ్చె!
హస్తసంజ్ఞలు చేసి ఆపుమన్నను గాని
ఆపుచేయ డిదేమి పాపమొక్కొ!
తనమాట వినిపించుకొనుచుండిరో లేదొ
గమనింప డిదియేమి ఖర్మమొక్కొ!
చప్పట్లు కొట్టిన చాలు చాలన్నను
దిగకుండె నేమి తద్దినము వచ్చె
అనుచు గడియారములు చూచునట్టివారు
లేచిపోవంగ అటునిటు చూచువారు,
కలుగు సభలో నుపన్యాస గర్దభులన
అరచువారల కీ పద్య మంకితమ్ము!
ఇంత గొడవగా ఉందని
కూర్చుంటాడా కూర్చొనడే
చేతితో సంజ్ఞలు చేసి ఆపవయ్యా
అన్నా ఆపడే ఇదేమి పాపము
అసలు తనమాటలు వింటున్నారా
వినలేదా అని పట్టించుకొనకుండా
ఇలా మాట్లాడతాడేమి ఖర్మ
చప్పట్లు కొట్టి చాలు చాలు
అని ఆపమన్నా ఆపడే
ఇదేమి దినం వచ్చింది
అంటూ గడియారాలు చూచుకొనేవారు
లేచిపోవడానికి అటుఇటు చూచేవారు
ఉన్న సభలో ఉపన్యలించే వారిని
ఉపన్యాసగర్దభులు అని అరచేవారికి
ఈ పద్యం అంకితం ఇస్తున్నానని-
ఈ పద్యభావం.
ఇలాంటివి దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో
చూచే ఉంటారు అలాంటి దాన్ని
కవిగారు మన కళ్ళకు కట్టినట్లు చూపారు
ఈ పద్యంలో
No comments:
Post a Comment