Sunday, February 5, 2017

చేటీ భవన్నిఖిల ఖేటీ


చేటీ భవన్నిఖిల ఖేటీ




సాహితీమిత్రులారా!


కాళిదాసకృత దోవీ అశ్వధాటి స్తోత్రంలోనిది ఈ శ్లోకం-
దేవి అశ్వధాటి అనే ఈ స్త్రోత్రం
శృంగార భక్తి రసాల సువర్ణ పేటి అంటారు
దీనిలో పరమేశ్వరి మనకు శృంగార రసాధిదేవతగా,
జ్ఞానామృతవర్షిణిగా, సర్వమంగళగా, సంతానప్రదగా,
సంగీతరసికగా, ఇంద్రాద్యమరవందితగా, భక్తజనతాపాపనోదినిగా,
దయాంబురాశిగా, రాక్షసఘ్నిగా, మాతృమూర్తిగా దివ్యదర్శనమిస్తుందట.
ఇందులోని ఒక శ్లోకం ఇక్కడ-

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా 
ఘోటీఖురా దధికధాటీ ముదారముఖవీటీరసేన తనుతామ్ 
                                                                                              (1)

దేవతాలోకంలోని స్త్రీలందరూ ఆ జగన్మాతకు చెలికత్తెలే
ఆ దేవికి వారితోటి నిత్యవిహారం కదంబవనంలోనే
సర్వదేవతలూ ఆమెకు శిరసువంచి పాదాభివందనం చేస్తుంటారు
అప్పుడు వారి కిరీటాలలోని వివిధమణికాంతులు ప్రసరించి
ఆమె పాదపద్మాలు రాగరంజితమౌతాయి. తన వక్షోజాలకు
అనులేపనమైన హరిచందనంతో తడిసి ఆమె స్తనవల్కం
సువాసనలు గుబాళిస్తోంది. ఆమె సర్వగుణసంపన్న
ఆమె సేవించిన తాంబూలంతో పరిసరాలు పరిమళిస్తాయి.
ఆ తాంబూల రసం అశ్వధాటిని మించిన ఆశుకవితా శక్తిని
ప్రసాదిస్తుంది. అటువంటి మహిమోపేతమైన ఆ తాంబూల
రసాన్ని సేవించే పార్వతీదేవి నాకు ఉత్తమ కవితా శక్తిని ప్రసాదించు గాక!



No comments:

Post a Comment