నక్షత్రాలు - వాటి ఆకారాలు ఆకాశంలో
సాహితీమిత్రులారా!
ఆకాశంలో నక్షత్రాలు చాలావున్నాయి కాని
మనం చిన్నపుడు నక్షత్రాలు 27 అని చదివాం
ఏది నిజం అంటే రెండూ నిజమే ఎలాగంటే
ఆకాశంలో అనేక వేల కోట్ల నక్షత్రాలున్నాయన్నది
నిజమే కాని మన జ్యోతిషశాస్త్రపరంగా 27
సూర్యుడు మన భూమినుండి చూచినపుడు
కొన్ని సందర్భాలలో ఉత్తరంగుండా పడమరకు
కొన్ని సందర్భాలలో దక్షిణం నుండి పడమరకు
వెళ్ళుతూ కనిపిస్తాడు అలా వెళ్ళే దానికి
క్రందుగా పైగా 5 డిగ్రీలు తీసుకుంటే ఒక
కంకణ వృత్తం వస్తుంది. దానిలో ఉన్న
నక్షత్రాలు 27 ఇది నక్షత్రాలు 27 కు
సంబంధించినది.
ఇక ఆకారం విషయానికొస్తే ఒక్కొక్క దాన్ని
విడిగా తారక అంటారు అనేక తారకలు కలిసి
ఒక నక్షత్రం అని పిలువబడుతున్నాయి.
ఒక్క తారకతో ఉండే నక్షత్రాలు అరుదు.
నక్షత్రకం పేరు వివరణ
1. అశ్వని - ఇందులో 3 చుక్కలు గుఱ్ఱం
ఆకారంలో ఉంటాయి
2. భరణి - త్రికోణ ఆకారంలో 3 చుక్కలుంటాయి.
3. కృత్తిక - 6 చుక్కలు చురకత్తి ఆకారం
4. రోహిణి - 5 చుక్కలు బండి ఆకారం
5. మృగశిర - 3 చుక్కలు బాణం వలె వరుసగా
6. ఆర్ద్ర - పగడంలా ఒంటి చుక్క
7. పునర్వసు - 5 చుక్కలు ధనుస్సులా
8. పుష్యము - 3 చుక్కలు వరుసగా
9. ఆశ్లేష - 6 చుక్కలు సర్పంలా
10. మఖ - 5 చుక్కలు పల్లకిలా
11.12 పుబ్బ, ఉత్తర - 4 చుక్కలు చౌకంగా(చదరంగా)
13. హస్త - 5 చుక్కలు చేయివలె
14. చిత్త - ఒక చుక్క ముత్యంలా
15. స్వాతి - ఒకే చుక్క మాణిక్యంలా
16. విశాఖ - 5 చుక్కలు కుమ్మరి సారెలా
17.18. అనూరాధ, జ్యేష్ఠ - 6 చుక్కలు అంగుళీ ఛత్రాకారంలా
19. మూల - 5 చుక్కలు కోపించిన సింహంలా
20,21. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ -
- రెండేసి చుక్కల కూడిన చౌకం
22. శ్రావణం - 3 చుక్కల వరుస
23. ధనిష్ఠ - 5 చుక్కలు మద్దెల ఆకారంలో
24. శతభిషం - వరుసగా 100 చుక్కలు
25, 26. పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర-
- రెండేసి చుక్కల జంట
27. రేవతి - 20 చుక్కలు చేప ఆకృతిలో
ఇవి ఆకాశంలో చూడటానికి
వాటి సంఖ్యను బట్టి గమనించవచ్చు.
No comments:
Post a Comment