Thursday, April 5, 2018

అప్పర్


అప్పర్




సాహితీమిత్రులారా!




ప్రసిద్ధ తమిళ గేయకర్తలలో అప్పర్ ఒకరు. 
ఈయన గేయకర్త, శైవాచార్యుడు. ఈయన
వ్రాసిన గేయాలు తమిళ శైవపవిత్రగ్రంథమైన
తేవారంలో పొందుపరచబడ్డాయి. తేవారంలో
8 భాగాలున్నాయి వాటిలో మూడు భాగాలు
అప్పర్ వ్రాసిన భక్తిగేయాలే ఉన్నాయి. 
అప్పర్ జీవితం అతి విచిత్ర సన్నివేశాలతో
కూడుకొన్నది. 

అప్పర్  7వ శతాబ్దికి చెందినవాడు. ఈయన
తమిళనాడులోని తిరువామార్ గ్రామంలో
జైన మతానుయాయులైన కుటుంబంలో
జన్మించాడు.              తన పాండిత్యం 
వల్ల జైనుల గౌరవాదరాలను ఎక్కువగా 
పొందిన అప్పర్ ఒకసారి తీవ్రమైన రోగానికి
గురయ్యాడు. ఎవరెంత ప్రయత్నించినా
అప్పర్ కు రోగనావారణ కలుగలేదు. అప్పర్ 
సోదరి, శివభక్తురాలైన తిలకవతి శివుని 
అనుగ్రహంతో అప్పర్ వ్యాధిని నయం చేసింది.
అప్పటి నుండి అప్పర్ కు శైవమతం మీద
విశ్వాసం, శివునిపై అచంచలమైన భక్తి కుదిరాయి.
అందుకు పోపించిన జైనాచార్యులు అప్పర్ను అనేక
బాధలకు, హింసలకు గురిచేశారు. శివానుగ్రహంవల్ల
వారి ప్రయత్నాలు అప్పర్ ను బాధించలేక పోయాయి.
అప్పర్ తన గేయాల్లో సుందరమైన ప్రకృతిని,
భక్తసులభుడైన శివుని మహాత్మ్యాన్ని అత్యంత 
మధురంగా వర్ణించారు. కేవలం శైవమత 
అనుయాయులనేకాక సాహితీ ప్రియులందరినీ 
అలరించారు.

No comments:

Post a Comment