Thursday, March 29, 2018

వందే విష్ణు సహోదరీ


వందే విష్ణు సహోదరీ



సాహితీమిత్రులారా!


"కట్టా అచ్చయ్య"గారి కృత
"చౌడేశ్వరీశతకం"(1919లో ముద్రితము)
లోని కొన్ని పద్యాలు ఇక్కడ చూద్దాం-

వందే విష్ణుసహోదరీ జయకరీ బ్రహ్మండభాండోదరీ
వందేసారకృపావలంబనకరీ వాగర్థశోభంకరీ
వందే క్రూరనిశాటభీషణకరీ భర్గప్రియా శాంకరీ
వందే భక్తవశంకరీ యనుచు నిన్బ్రార్థింతు చౌడేశ్వరీ!

తప్పుల్ గల్గిన నొప్పుగాగొనెడు పెద్దల్ గల్గరే యొప్పులన్
దప్పుల్ గాగణియించి యోర్వమిని వాదంబాడు దుష్టాళిచే
మెప్పుంజెందినఁ జెందకున్న నదిభూమిన్ గొప్పగాదేరికిన్
గొప్పౌనీపదపంకజాశ్రయము నాకుంజూడ చౌడేశ్వరీ!

ఏజన్మంబున గష్టసౌఖ్యముల నేనేలీలగన్నాడనో
యీజన్మంబున కేమిగోచరముతల్లీ ఘోరదారిద్య్ర బా
ధాజీమూతనికేతనస్థిత మహాంధ్యంబైన సంసారమా
యీజన్మంబున నాకమర్చుటలు లేదే కూర్మి చౌడేశ్వరీ!

మునునే భజింపకుంటినొ, మఱేమో, యెట్టపాపిష్టినో
గనజాలంగద నేటికైనమనుమార్గం; బిష్టకామ్యార్థమున్
జననంబందినదాది కష్టములలోనన్ దూగగానయ్యె నో
జననీ యింతచలంబె బ్రోవుమిక మోక్షబిచ్చి చౌడేశ్వరీ!
-----------------------------------------------
- ఏ.వి.రమణరాజు


1 comment:

  1. source

    https://ia801405.us.archive.org/BookReader/BookReaderImages.php?zip=/16/items/telugulo-dandaka-sahityamu-by-dr-g-suryabhaskar-rao-in-telugu/Telugulo%20Dandaka%20Sahityamu%20By%20Dr.%20G.%20Suryabhaskar%20Rao%20In%20Telugu_jp2.zip&file=Telugulo%20Dandaka%20Sahityamu%20By%20Dr.%20G.%20Suryabhaskar%20Rao%20In%20Telugu_jp2/Telugulo%20Dandaka%20Sahityamu%20By%20Dr.%20G.%20Suryabhaskar%20Rao%20In%20Telugu_0164.jp2&id=telugulo-dandaka-sahityamu-by-dr-g-suryabhaskar-rao-in-telugu&scale=2&rotate=0


    చౌడేశ్వరీ అమ్మవారి దండకము


    రాజరాజేశ్వరీ, సర్వలోకేశ్వరీ, సర్వభూతేశ్వరీ, మారి కాత్యాయనీ మా నామ నామాంకితంబుల్‌.... బ్రోచుమీ ఈశ్వరీ జగదీశ్వరీ మాహేశ్వరీ చౌడేశ్వరీ మీకుం నమస్తే నమస్తే నమస్తే నమః
    శ్రీ పింజల సోమశేఖరరావు (రచన)

    ReplyDelete