Thursday, March 2, 2017

వీరినెన్నడూ అవమానించరాదు


వీరినెన్నడూ అవమానించరాదు




సాహితీమిత్రులారా!


ఎవరినీ అవమానించకూడదు.
కానీ వీరి విషయంలో అసలు
అలాంటిది జరుగకూడదు ఎవరువారు
ఈ శ్లోకం చూడండి-

క్షత్రియం చైవ సర్పంచ
బ్రాహ్మణంచ బహుశ్రుతమ్
నావమన్యేత వై భూష్ణుః
కృశా నపి క దాచన

పరాక్రమం గల రాజునునీ
పామునీ, బాగా పాండిత్యంగల బ్రాహ్మణుని,
బాగా బ్రతికి - చెడినందున అవస్థలు పడేవాడినీ
ఎన్నడూ అవమానించరాదు.
ఎందుకంటే - వీరు తాత్కాలితంగా ఏమీ చేయలేకున్నా
తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి అవతలివారి
అంతు చూడగలరు. కనుక -
వీరి విషయంలో అమర్యాదకు తావివ్వరాదు.

No comments:

Post a Comment