దైష్టికులు లెవరు?
సాహితీమిత్రులారా!
మనం ఎన్నివిన్నా కొన్ని పదాలు తెలియవు
అలాంటివి అప్పుడప్పుడూ తెలుసుకుందాము.
ఆస్తికులు అంటే దేవుడు ఉండాడని నమ్మేవారు అని అనుకుంటాము
కానీ మరణానంతర జీవితం మీద నమ్మకం
కలవారనికూడ అర్థం
నాస్తికులు - దేవుడు లేడని వాదించేవారు. అనికాదు
మరణానంతర జీవితంపై నమ్మకం లేనివారు.
దైష్టికులు - జరిగేది జరగకమానదని భావించే హేతువాదులు
శాక్తికీ - అంటే బల్లెం ప్రయోగించే స్త్రీ
ఛాత్రుడు - అంటే గురువును ఛత్రంలా పోషిస్తాడని అంటారు
అంతేకాదు గురువుకు సమీపంలో ఉండేవాడు
ఐకాన్యిక - వేదపఠనంలో పరీక్షపెట్టిపుడు తప్పుల
సంఖ్యను గుర్తిస్తారు. ఒక తప్పు మాత్రమే
చేసిన విద్యార్థిని ఐకాన్యిక అంటారు.
అధ్యయనం అంటే గురువుగారి పెదవులనుండి
వెలువడిన వాక్కులను పునరుక్తం చేయడం.
వేదనమ్ అంటే గురువుగారి పెదవులనుండి వెలువడిన
వాక్కులకు అర్థం తెలుసుకోవడం
(భారతీయ విద్య (డా. డి. చంద్రశేఖర రెడ్డి)
నుండి గ్రహించినవి)
No comments:
Post a Comment