Wednesday, March 1, 2017

ఇది సాధారణమైన అంశమేకదా!


ఇది సాధారణమైన అంశమేకదా!
సాహితీమిత్రులారా!


భర్తృహరి శృంగారశతకంలోని
ఈ పద్యం చూడండి-

కుఙ్కుమ పఙ్కకళఙ్కితదేహా
గౌరపయోధరకమ్పితహారా
నూపురహంసరణత్పదపద్మా కం
న వశీకురుతే భువి రామా

కుంకుమ పువ్వును దేహానికి అద్దుకొని,
పసిమిరంగు పాలిండ్లపై ముత్యాలసరాలు
అదురుతూండగా- కాలి అందెలు ఘల్లు
ఘల్లున మ్రోగుతుండగా సంచరించే
స్త్రీ  జనావళికి పురుషపుంగవుతో
జితేంద్రియులైనా వశులై ఉండటం
అతి సాధారణ అంశం

స్త్రీకి అచువంటి శక్తి ఉందట
కాదనలేని
కాదనరాని
నిజం కదా

No comments:

Post a Comment