అధరామృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తాడు
సాహితీమిత్రులారా!
భర్తృహరి నీతులేకాదు శృంగారపరమైనవాటిని
శృంగారశతకంలో వివరించాడు ఈ శ్లోకం చూడండి-
ఉరసి నిపతితానాం స్రస్తధమ్మల్లకానాం
ముకుళితనయనానాం కించి దున్మీలితానామ్
ఉపరిసురతఖేద స్విన్నగండస్థలానాం
అధరమధు వధూనాం భాగ్యవస్తః పిబంతి
పురుషుడు కింద ఉండగా, స్త్రీ పైన ఉండి రతి చేయడం పురుషాయితం.
దీనివల్ల అనాయాసంగా ఒకరి మొఖాలొకరికి అందుబాటులోకి వస్తాయి.
దీనిలో నాయిక సిగ్గి విడిచి యధేచ్ఛగా తానే రతికి సంసిద్ధురాలై ఉన్నందున,
అలాంటి భాగ్యం తనకు కలిగినందుకు ఆనందిస్తూ ప్రియురాలి అధరామృతాన్ని
తనివితీరా ఆస్వాదిస్తాడు పురుషుడు. అట్టివాడే నిజమైన కామతంత్రం తెలిసినవాడు -
అని శ్లోక భావం
కామయుద్ధపు పట్లలో ధేనూకము, పురుషాయితము
వంటివి స్త్రీకి రతిలో గొప్ప తృప్తిని కలిగిస్తాయి.
దీన్నే ఏనుగు లక్ష్మణకవి తెలుగులో-
అక్కున వ్రాలి, కొప్పువిడి యల్లలనాఁడగఁ, గన్ను దామరల్
చక్కఁగ మోడ్చి, చొక్కి, పురుషాయితసంజనితశ్రమంబునం
జెక్కుల ఘర్మబిందువులు చిందఁగ, విందొనరించుబోంట్లమే
ల్చొక్కపుమోవితేనె చవిజూతురు భాగ్యముఁ గల్పు నేర్పరుల్
No comments:
Post a Comment