Saturday, April 1, 2017

చెడనిది పద్యం ఒకటే


చెడనిది పద్యం ఒకటే




సాహితీమిత్రులారా!




ప్రపంచంలో అన్నీ నశించిపోతాయట
కాని పద్యం ఒకటి నిలిచి ఉంటుందని
ఒక పద్యం ఉంది-
గువ్వల చెన్న అనే మకుటంతో వ్రాయబడింది
అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఇక్కడ
మాట్లాడుకుంటున్నాము.

గుడికూలును, నుయిపూడును
వడినీళ్ళకు చెరువుతెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడియెడమల కీర్తిగన్న గువ్వలచెన్నా!

ఇటు అటు అనక అన్ని దిక్కలా దానధర్మాలతో
కీర్తిని వ్యాపింప చేసుకొన్న చెన్నప్పగారూ
సప్తసంతానాలతో సంబరపడాలని, దాతలెందరో
గుళ్ళను, గోపురాలను, నూతులను, చెరువులను,
ఉద్యానవనాలనూ నిర్మించి ఖ్యాతిని గడిస్తారు
కాని, ఇవన్నీ కొద్దికాల మాత్రమే నాశనమౌతాయి తరువాత
బాగుచేయించేవారుండరు ఉండినా అవి సరిగా ఉండవు.
ఇక చెడనిది అంటూ ఉన్నది ఒకటే అది సత్కవి చెప్పిన పద్యం
కాబట్టి అలాంటి చమత్కృతితోడి వ్రాసిన కవులను పండితులను
ఆదరించు కావ్యాలను అంకితం తీసుకో, వాటిని ముద్రణ
వేయించటానికి సహాయం చేయి దానివల్ల దాతల కీర్తి లోకంలో
వివిధస్థాయిలలో నిలబడుతుంది - అంటున్నాడు కవి

No comments:

Post a Comment