వసుదేవుడెవరు? కుంతీదేవి ఎవరు?
సాహితీమిత్రులారా!
బ్రహ్మపురాణం ప్రకారం-
దేవమీఢుడు అనే రాజుకు
అసక్ని అనే కుమారుడు
ఆయన కుమారుడు శూరుడు
శూరునికి 10 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు
ఈ కుమారులలో మొదటివాడు వసుదేవుడు
2. దేవభాగుడు, 3. దేవశ్రవుడు, 4. అనాదృష్టి
5. కనవకుడు, 6. వత్సవంతుడు, 7. శ్యాముడు
8. శ్యమీకుడు, 9. గృంజముడు, 10. గండూషుడు
కుమార్తెలు-
పృథ(కుంతీదేవి) - భర్త - పాండురాజు -
కుమారులు - పాండవులు
పృథుకీర్తి - భర్త - శ్రుతదేవ -
కుమారుడు - దంతవక్రుడు
శ్రుతికీర్తి - భర్త - ధృతకేతు
కుమారులు - ప్రతర్థనాదులు
కుమార్తె - భద్ర
శ్రుతశ్రవ - భర్త - దమఘోషుడు
కుమారులు -శిశుపాలుడు, సాల్వుడు
రాజాధిదేవి - భర్త- జయత్సేనుడు
కుమారులు - విందానువిందులు
కుమార్తె - మిత్రవింద
దీని ప్రకారం -
వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి
కుంతీదేవి వసుదేవుని చెల్లెలు
పాండవుల తల్లి, శ్రీకృష్ణుని మేనత్త.
No comments:
Post a Comment