కంటికి నిద్ర వచ్చునే?
సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు తన మనసులోని బాధను
కాశీఖండంలో వింధ్యపర్వతంతో పలికించాడు
చూడండి-
కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కల్గినన్
నిద్ర, రతి సౌఖ్యం, తిండి, అనేవి
మనసుకు సంబంధించినవి
మనసు సరిగాలేనపుడు అవి సక్రమంగా ఉండవు
అదే విషయాన్ని ఇందులో గమనించవచ్చు
తనంతటి శత్రువొకడు ఉంటే మనిషైనవానికి
నిద్రపడుతుందా?,
రతికేళి సుఖాన్ని ఇస్తుందా?
తిండి రుచిస్తుందా?
ఇవేవీ సరిగా ఉండవు- అని భావం
No comments:
Post a Comment