ఉపమాలంకార విశేషాలు - 4
సాహితీమిత్రులారా~
దండి వివరించిన
ఉపమాలంకార రూపాలను చూశాము.
ఇక్కడ అప్పయ్యదీక్షితులవారి
ఉపమ ఆహార్యభేదాలను చూద్దాం.
1.ఉపమ -
ముఖము చంద్రునివలె నున్నది
2. ఉపమేయోపమ -
ముఖము చంద్రునివలె నున్నది
చంద్రుడు ముఖమువలె నున్నాడు
3. అనన్వయము-
ముఖము ముఖమువలె నున్నది
4. ప్రతీపము -
చంద్రుడు ముఖమువలె నున్నాడు
5. స్మరణము-
చంద్రునిఁజూడ ప్రియాముఖము జ్ఞప్తికి వచ్చెను.
6. రూపకము -
ముఖమే చంద్రుడు
7. పరిణామము-
ముఖచంద్రునిచే తాపము శమించును.
8. సందేహము -
ఇది ముఖమా? చంద్రుడా?
9. భ్రాంతిమంతము -
చంద్రుడని చకోరములు నీ ముఖము వైపుకు పరుగులిడుచున్నవి.
10. ఉల్లేఖము -
చంద్రుడని చకోరములు, కమలములని తుమ్మెదలు
నీముఖమును ఆశించుచున్నవి.
No comments:
Post a Comment