శ్రీయుతులు విద్వాన్ వి.యమ్. భాస్కరరాజుగారి పద్యమాల -
కవిత్వంలో - క్రియాశీలత
08-04-2016 దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా
శ్రీయుతులు విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి కలంనుండి జాలువారిన పద్యకవిత ఆస్వాదించండి
చిలుక పలుకులు, తుమ్మెద వలపు ధ్వనులు ధర వసంతరాగాలు కోయిలల కూజి తాలు - సంతోష వారాశి తన్వుచుండ కవుల కవితలు విలసిల్లు ఘనవిధాన
మానవతఁబ్రోచి మమతల మల్లె లేచ కీడు లెల్ల కాల్రాచి సత్కీర్తి వెలుగ సర్వజనక్షేమ సంధాన పర్వమనగ అవని "దుర్ముఖి" వత్సర మవతరించె
మనిషి, పశువుల భేదాలు వహిని గాంచ ఎంత భేదమొ కన్పించు - వింత గొలుపు తెలివి - మనిషి మనీషియై వెలుగవలయు "మానవత్వమె" వసుధైక మతము - నిజము
తెలివి తేటల జీవించి విలువ పెంచి
మంచివాడనుపేర రాణించవలయు
నవ్య వత్సర శోభలు దివ్యమవగ
అమలినానంద సామ్రాజ్యమధివసించు
జీవితమంతహాయి, జనసేవలఁజేసి తరించి, పృధ్విలో
తా వసుధైక భావమున, ధార్మికచింతన ఉజ్వలింప, సత్
పావనమూర్తియై ప్రజల భవ్యమహోన్నతి నాదుకొనుచు, సం
భావనతోడ మెల్గవలె - భారతదేశ జనాళి నిచ్చలున్
జీవితమంతహాయి, జనసేవలఁజేసి తరించి, పృధ్విలో
తా వసుధైక భావమున, ధార్మికచింతన ఉజ్వలింప, సత్
పావనమూర్తియై ప్రజల భవ్యమహోన్నతి నాదుకొనుచు, సం
భావనతోడ మెల్గవలె - భారతదేశ జనాళి నిచ్చలున్
అజ్ఞానమున్ గూల్చి, విజ్ఞానమున్ బేర్చి పఠితల హృదయాలు పల్లవింప జిజ్ఞాస కవిగంచి, ప్రజ్ఞను వెలిగించి పాఠక మనసులు పరవశింప సంస్కారమేపార, సద్గోష్ఠి ఇంపార మధురోహలిలసాగి సుధలునింప సౌజన్యమార్గాన సత్యాగ్రహవిధాన కృపతోడ జనులు సత్కీర్తిఁగాంచ
మంచి కవితల సృష్టి రాణించి ప్రగతి
జగతి కళ్యాణ కాంక్ష ప్రశస్తి నిలువ
సమసమాజ నిర్మాణమే అమరునటుల
ధర "క్రియాశీల కవితలు" వరలవలయు
----- విద్వాన్ వి.యమ్.భాస్కరరాజు,
రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగుపండిట్
చరవాణి సంఖ్య 9959464757
No comments:
Post a Comment