"రసానందము బ్రహ్మానందసహోదరము"
సాహితీమిత్రులారా !
రసో వై స: - అతడు రసస్వరూపుడు - అనగనది వేదకాలంనాటి సూక్తి.
రసానందము బ్రహ్మానందసహోదరము, లోకోత్తరచమత్కారభాజనము,
విగళితవేద్యాంతరము, అనిర్వచనీయము, వాచామగోచరము - అని అనేకవిధాలుగా
అలంకారికులు వివరించినారు. లౌకికసంతోషం వేరు, ఆనందం వేరు మానుషసంతోషానుభూతికంటె ఎన్నోలక్షలరెట్లు అనందానుభూతి గొప్పదని అలంకారికుల ప్రవచనం.
తైత్తిరీయోపనిషత్తు నందలి ఆనందవల్లిలో ఆనందమీమాంస కలదు. మానుషానందం అనగా యువకుడు, సాధువు, ద్రఢిష్ఠుడు, బలిష్ఠుడునైన మహారాజు అనుభవించు ఆనందం.
బ్రహ్మానందం అనగా ఆనందవల్లి గణితం ప్రకారం-
100 మానుషానందములు = 1మనుష్యగంధర్వానందం
100 మనుష్యగంధర్వానందములు = 1 దేవగంధర్వానందం
100 దేవగంధర్వానందములు = 1 పితృదేవతానందం
100 పితృదేవతానందములు = 1 ఆజానదేవతానందం
100 ఆజానదేవతానందములు = 1 కర్మదేవతానందం
100 కర్మదేవతానందములు = 1 దేవానందం
100 దేవానందములు = 1 ఇంద్రానందం
100 ఇంద్రానందములు = 1 బృహస్పత్యానందం
100 బృహస్పత్యానందములు = 1 ప్రజాపత్యానందం
100 ప్రజాపత్యానందములు = 1 బ్రహ్మానందం
పై చెప్పిన గణితం ప్రకారం
100000000000000000000 మానుషానందాలు = 1 బ్రహ్మానందం
మరి బ్రహ్మానందం అంటే బ్రహ్మానందమా మజాకా
No comments:
Post a Comment