కవితా కుమారి
సాహితీమిత్రులారా!జంధ్యాల పాపయ్వశాస్త్రిగారు కరుణశ్రీ అనే కలంపేరుతో తన రచనలు సాగించి చరితార్థులైనారు.
వారి ఉషశ్రీలోని కవితాఖండిక
ఈ కవితాకుమారి చూడండి.
ఈ కవితాకుమారి చూడండి.
జడయల్లి జడకుచ్చులిడ "రాయప్రోలు" "త
ల్లావజ్ఝల" కిరీటలక్ష్మినింప
"పింగళి " "కాటూరి" ముంగురుల్ సవరింప
"దేవులపల్లి" శ్రీతిలకముంప
"విశ్వనాథ" వినుత్న విధుల కిన్నెరమీట,
"తుమ్మల" రాష్ట్రగానమ్మొనర్ప
"వేదుల" "నాయని" వింజామరలు వేయ
"బసవరాజు" "కొడాలి" పదములొత్త
"అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప
"జాషువా " "ఏటుకూరి" హెచ్చరికలిడగ
నవ్యసాహిత్య సింహాసనమున నీకు,
ఆంధ్రకవితాకుమారి "దీర్ఘయురస్తు"
ఈ కవితలో రాయప్రోలు, తల్లావజ్ఝల, కాటూరి,
దేవులపల్లి, విశ్వనాథ, తుమ్మల, వేదుల, నాయని,
బసవరాజు, కొడాలి, అడవి, నండూరి, జాషువా,
ఏటుకూరి - ఇవన్నీ కవులపేర్లే వీరు కవితాకుమారిని
రకరకాలుగా అర్చించారు. అందుకే వారందరిచేతిలో
పెరిగిన కవితాకుమారికి దీర్ఘాయు అంటున్నాడు
పాపయ్యశాస్త్రిగారు. ఎంత చమత్కారంగా కూర్చాడు.
దేవులపల్లి, విశ్వనాథ, తుమ్మల, వేదుల, నాయని,
బసవరాజు, కొడాలి, అడవి, నండూరి, జాషువా,
ఏటుకూరి - ఇవన్నీ కవులపేర్లే వీరు కవితాకుమారిని
రకరకాలుగా అర్చించారు. అందుకే వారందరిచేతిలో
పెరిగిన కవితాకుమారికి దీర్ఘాయు అంటున్నాడు
పాపయ్యశాస్త్రిగారు. ఎంత చమత్కారంగా కూర్చాడు.
జడయల్లి జడకుచ్చులిడ "రాయప్రోలు" "త
ReplyDeleteల్లావజ్ఝల" కిరీటలక్ష్మినింప
"పింగళి " "కాటూరి" ముంగురుల్ సవరింప
"దేవులపల్లి" శ్రీతిలకముంప
"విశ్వనాథ" వినుత్న విధుల కిన్నెరమీట,
"తుమ్మల" రాష్ట్రగానమ్మొనర్ప
"వేదుల" "నాయని" వింజామరలు వీవ
"బసవరాజు" "కొడాలి" పదములొత్త
"అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప
"జాషువా " "ఏటుకూరి" హెచ్చరికలిడగ
నవ్యసాహిత్య సింహాసనమున నీకు,
ఆంధ్రకవితాకుమారి "దీర్ఘయురస్తు"