వసంతం
సాహితీమిత్రులారా!
ఈ వసంతం అనే కవిత
"ఫూలోం కీ బహార్" అనే హిందీ
కవితకు
స్వేచ్ఛానువాదం)
దూరమెరుగని దూరం
నుండి
విరామ మెరుగక
పయనాన్ని
సాగిస్తున్న
పాంధకిశోరాన్ని
వెదకుతున్నాను
వసంతాన్ని
అదుగో వసంతం వెల్లివిరిసి
వనిరూపుదాల్చింది
ఆవనిలో వూగే
విరులూ
తరులు తరుశాఖలూ
నన్నే
పిలుస్తున్నాయి పదేపదే
తోటమాలీ తలుపు తెరవవోయీ
తోటమాలీ తలుపు తెరవవోయీ
నీతోటలోని ప్రతి కొమ్మారెమ్మా
నన్నేపిలుస్తున్నాయి కమ్మగా
స్తబకాల
వన్నెలవెలిగే వనిలో
ననకారుశోభనాట్యమాడే
వనిలో
ఆటలాడేపూల
పాటపాడే తుమ్మెదల
చూడమంటున్నాయి
కొమ్మలు
తోటమాలీ తలుపు తెరవవోయి!
నీతోటలోని కొమ్మలు
నన్నేపిలుస్తున్నాయి!
అవి వనినేత్రాలా
దివిలోని తారకలా
ఆనందం
చిమ్మేగొట్టాలా
నీతోటలోని అందాల
విరులు
తోటమాలీ తలుపుతెరవవోయి!
నీతోట
ప్రతిపూవునన్నేపిలుస్తున్నాయి!
విరితావుల
మత్తెక్కి
ఆనందపు
పిచ్చెత్తి
నన్నువోపాటపాడమని
స్వాగతం
పలుకుతున్నాయి
తలుపు తెరువు తోటమాలీ!
నాపాలిటి వనమాలీ!
నాపాలిటి వనమాలీ!
శాద్వల శ్యామల
భూతలస్వర్గం
కాదిది
అపరిదివితలస్వర్గం
తోటప్రక్కలవెళ్ళే
వారికేం తెలుసు
కన్నెత్తియైనా
ఇటు చూడరు
ఏపూలు విరిశాయో
వారికేం తెలుసు
తోటమాలీ తలుపు తెరవవోయీ!
తోటమాలీ తలుపు తెరవవోయీ!
హాసవిలాస సుఖాల
జీవించి
తుదకా సుఖాల్లోనే
నశించే
ఆనంద రూపాలీ విరులు
వీని చావుకేమీ
బ్రతుకేమీ
నేనూ వీటి నవ్వుల నేర్వడానికే వచ్చా
నింత దూరం ఆ పువ్వుల నవ్వుల నన్ను
నేర్వనీ తోటమాలీ తలుపు తెరవవోయీ!
తోటమాలీ తలుపు తెరవవోయీ!
తోటమాలీ తలుపు తెరవవోయీ!
వనమాలీ తలుపు
తెరవవోయీ!
ఆ పూలు నన్ను
పిలుస్తున్నాయి.
No comments:
Post a Comment