సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే
సాహితీమిత్రులారా!
రాఘవపాండవీయం అనే ద్వ్యర్థికావ్యం
అంటే రామునికథ, కృష్ణునికథ
రెండు ఒకే పుస్తకంలో ఉండటం
అంటే ఒక పద్యాన్ని ఒక అర్థంతో చదివితే
రామునికథ అవుతుంది. అదే పద్యాన్ని
మరో అర్థం తీసుకుంటే కృష్ణుని కథ
అయ్యే విధంగా వ్రాయబడిన పుస్తకం.
అందులోని ఒక పద్యాన్ని ఇక్కడ
ఉటంకించుకుందాం
దశరథుడు / పాండురాజు జైత్రయాత్ర
సందర్భంలో ని పద్యం
తఁలపం జొప్పడి యొప్పె నప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రాసము
త్కలికారింఖదసంఖ్య సంఖ్యజయవత్కంఖా ణరింఖావిశృం
ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నే రన
ర్గళ భేరీరవ నిర్దళద్గగనరేఖా లేపపంకాతిన్
ఇది ఈ వీడియో చివర్లో గరికపాటివారి
వివరణతో పలకడం కూడ వినవచ్చు వినండి
No comments:
Post a Comment