సంక్రాంతి అంటే ఎవరి పండుగ?
సాహితీమిత్రులారా!
సంక్రాంతి గురించి తెలుసుకునే ముందు
కొంత జ్యోతిషవిషయం చర్చించుకుందాం-
మనకు ఆకాశంలో కోట్లాది తారకలున్నాయి.
కాని మనం తెలుగులోనైతేనేమి జ్యోతిషంలో
నైతేనేమి నక్షత్రాలు 27 అంటున్నాము.
అంటే అన్ని కోట్ల నక్షత్రాలుంటే 27 అనడమేమి
ఇది ముందు తెలుసుకుందాము.
సూర్యుడు ఆకాశంలో వెళ్ళినట్లు మనకు(భూమ్మీదివారికి)
కనబడుతుంది. దాన్నే మనం రవి మార్గం అంటాం.
ఈ మార్గంలో పైకి 5 డిగ్రీలు, క్రిందకు 5 డిగ్రీలు తీసుకోగా
వాటి మధ్యనుండే తారకలను కలపగా కొన్ని రకాల ఆకారాలు
ఏర్పడ్డాయి. వాటికి పేర్లు పెట్టారు అవే అశ్వని, భరణి,
కృత్తిక, రోహిణి, మృగశిర ఇలా 27 పేర్లున్నాయి. వాటినే
మనం నక్షత్రాలంటున్నాము. ఈ 27 నక్షత్రాలను మరి కొన్ని
గుంపులుగా చేసి కలుపగా మరి కొన్ని రకాల ఆకారాలు
వచ్చాయి అవి- మేషం(మేక), వృషభం(ఎద్దు) ఇలా
12 రకాల ఆకారాలు వచ్చాయి. కొన్ని గుంపుల వల్ల
ఏర్పడ్డాయి కావున వీటిని రాసులు(గుంపులు) అని
పిలుస్తున్నాం. ఈ రాసుల్లో సూర్యుడు పయనిస్తాడు కదా
దీన్నే సంక్రమణం అంటాం. ఏ రాశిలో కెళితే ఆ రాశిపేరున
ఆ సంక్రమణం అదే సంక్రాంతి అంటాం. ప్రతినెల ఒక రాశిలోకి
సూర్యుడు మారుతుంటాడు. అయితే సూర్యుడు తిరిగే
ప్రతి రాశికి ఒక సంక్రాంతి అన్నాం కదా వాటికన్నిటికీ
మనం పండగలు చేస్తున్నామా అంటే లేదు. మన పంచాంగాల్లో
మాససంక్రాంతి పేరున ప్రతినెల కనిపిస్తుంది. వాటికి మనం అంతగా
గమనించడంలేదు. కేవలం మకరసంక్రాంతిని మాత్రమే పండుగగా
పెద్ద ఎత్తున చేస్తున్నాము. కారణం ఏమిటంటే. మకరసంక్రమణం
నుండి సూర్యుడు ఉత్తరం వైపునకు ప్రయాణం చేస్తాడు. అంటే
మనకు సూర్యుడు రెండు రకాల ప్రయాణాలను కలిగి ఉన్నాడు
ఒకటి ఉత్తర అయనం(ప్రయాణం), రెండవది దక్షిణ అయనం
వీటిలో ఉత్తర అయనం పుణ్యకాలమని మనవారి నమ్మకం.
అందుకే మకరసంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం.
ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.
దీని వల్ల వారు ఉత్తమగతులకు పోతారని ఒక నమ్మకం.
ఇది మిత్రులారా సంక్రాంతి కథా కమామిషు.
No comments:
Post a Comment