Wednesday, January 24, 2018

ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం


ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రకవి 
రామాభ్యుదయంలో
సముద్రాన్ని లంఘించే సమయంలో
హనుమంతుని వర్ణించిన తీరు-

తనచూపంబుధి మీఁదఁ జాఁచి శ్రవణద్వంద్వంబు రిక్కిం చి వం
చిన చంచత్భుజముల్ సముత్కట కటీసీమంబులన్ బూన్చి తోఁ
క నభోవీధికిఁ బెంచి యంఘ్రులిరియంగాఁ బెట్టి బిట్టూఁది గ్ర
క్కున నక్కొండ యడంగఁద్రొక్కి పయికిన్ గుప్పించి లంఘించుచోన్
                     (రామాభ్యుదయము - 6 - 93)

ఈ పద్యం భావాన్ని గమనించిన తరువాత
ఈ పద్యం చూడండి -
ఇది తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి కృత
శ్రీరామకథా2మృతము అనే గ్రంధంలోని
సీసపద్యం -
మొలదట్టిపై బాహువులు మోపి పాదము
       లించుక గుదియించి యెరువు సేసి
యిలఁద్రొక్కి యిమ్మున నిలిచి కంఠమ్మును
       మూఁపులుఁగర్ణముల్మొనయఁదిగిచి
యెడఁబ్రాణధారణంబొదవించి నెక్కొని
       నింగిపై దృష్టులు నెలవు కొలిపి
పులకలు నెమ్మేనఁ బొదల నూష్మలభావ
       ముననొప్పి శరవేగమునఁ దనర్చి
యెగసెఁ గుప్పింపఁ గ్రుంగితో నెగసి యమ్మ
హెంద్రధర మనుయాయిత్వమెఱుక సేయ
నెదిరి భంగంబు స్వీయసమృద్ధి నోటఁ
దెలుపకయ తెల్పుచును వాయుదేవసుతుఁడు
                              (శ్రీరామకథా2మృతము - సుందరకాండ - 27)

వీరిద్దరి హనుమద్దర్శనము ఆ సమయంలో ఎలావున్నదో
మనం గమనించ వచ్చు.
చేతులు నడుంమీద పెట్టుకోవడం దగ్గరనుంచి
అన్ని దాదాపుగా ఒకలాగే కనిపిస్తున్నవికదా

No comments:

Post a Comment