Sunday, January 21, 2018

ఏ వ్రాలైనను వ్రాయును


ఏ వ్రాలైనను వ్రాయును




సాహితీమిత్రులారా!


రాయనిమంత్రి భాస్కరుని గురించిన
చాటువులు అనేకం వున్నాయి
వాటిలో ఒకటి-

ఏ వ్రాలైనను వ్రాయును
"నా" వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్
"సి" వ్రాసి "తా" వత్తివ్వడు
భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్

రాయని భాస్కరుని దాతృత్వాన్ని చెప్పే పద్యం ఇది
ఇందులో అక్షరాభ్యాసం వేళనుండీ నా - అనే అక్షరం
వ్రాసేవాడు కాదట. ఒస వేళ వ్రాసినా సి అని వ్రాసి
తా వత్తివ్వడట. అంటే స్తి - అని వ్రాయడట.
దానగుణం పుట్టుకతో వచ్చిందని. అంటే ఆ దాతకు
నాస్తి(లేదు) అని అనటంకాని వ్రాయటంకాని చేతకాదు -
అని భావం.


1 comment:

  1. రాయన మంత్రి భాస్కరునిపై అద్భుత చాటువులు ఇక్కడ చూడవచ్చు
    https://aadhyatmikachintana.blogspot.com/2020/07/blog-post_47.html

    ReplyDelete