Wednesday, January 17, 2018

తెలిసి పీల్చుకో గాలిని


తెలిసి పీల్చుకో గాలిని
సాహితీమిత్రులారా!

ఊపిరి అంటే ప్రాణం కదా!
ప్రాణం నిలవాలంటే గాలిపీల్చుకోవాలికదా!
ఆ గాలిని మనం ఎలా పీల్చుకుంటున్నాము
అన్నదే ప్రశ్న - దాన్నిగురించి తెలుసుకునే 
ప్రయత్నం చేద్దామా - 
         అసలు మనం గాలిని ఎన్నిమార్లు 
పీల్చుకొని వదులుతాము ఒక నిముసానికి
అంటే 14 నుండి 16 సార్లు ఈ పద్ధతిలో
గాలిని పీల్చుకుంటున్నామా ఏమో ఎవరు 
లెక్కగట్టారు. పోనీ ఎలా గాలిపీల్చు
కుంటున్నామో గమనించామా? అంటే
రోజులాగే అదికాదు మీరు పిల్లలను
గాలిపీల్చుకునేప్పుడు పరిశీలించారా
వారు గాలిపీల్చుకుంటే పొట్ట పెద్దవుతూ
చిన్నదవుతూ ఉంటుంది. అలా పెద్దలు
ఎంతమంది గాలిపీల్చుకుంటున్నారో 
గమనించామా ఇక అసలు విషయానికొద్దాం-
ప్రతి మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాస 
తీసుకోవాలి వీటిలో ఎక్కువతక్కువ లుండకూడదు
ఉంటే ఏమంటారా మీ దగ్గర ప్రతిరోజూ
జియోవాడు 1జి.బి. డేటా ఇస్తున్నాడు కదా
అది మీరు వాడటానికి 24 గంటలు మాత్రమే 
మీ పరిమితి పరిమితిలో వాడుకుంటే 24 గంటలు
వాడవచ్చు. లేదంటే ముందే అయిపోయింది
మీరు వాడుకోడానికి వేగంగా పనిచేయదు 
స్లోగా నెట్ పనిచేసుంది అంటున్నారు కదా.
ఇది ఉదాహరణమాత్రమే ఇక్కడ మనకు 
గమనించాల్సిన అంశం ఒకటుంది.
ఏక్కువగా వాడితే ముందే అయిపోతుంది
తక్కువవాడితే నిర్ణీత సమయంవరకు ఉంటుంది.
అలానే మనం సరిగా రోజుకు 21,600 శ్వాసతీసుకుంటే
శతమానం భవతి. లేదంటే ముందుగానే శతమానం
అనుకోవాలి. రోజుకు 30లేక 40 వేలు శ్వాసలు పీల్చితే
ముందుగానే మన ఆయువు తీరుతుంది. అలాకాక
నిర్ణీతంగా శ్వాసిస్తే 100 సంవత్సరాలు జీవించవచ్చు
అలాకాదు మీరు 21600 x 24 = 518400 శ్వాసలు ఒక రోజుకు
అదే సంవత్సరానికి 518400ను 365 చే గుణిస్తే వచ్చే
సంఖ్య ఒక సంవత్సరంలో మనం శ్వాసించాల్సిన శ్వాసల 
సంఖ్య మరి ఒక 100 సంవత్సరాల్లో అంటే ఆ లెక్క మరీ 
ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో 21600 శ్వాసలు
కాకుండా 20000 వేల శ్వాసలు పీల్చామనుకుంటే 16 వందల
శ్వాసలు మనం మిగుల్చుకున్నట్టు కదా ఇవి ఇదే ప్రకారం
100 సంవత్సరాలకు ఎన్ని మిగులుతాయో అవన్నీ మనకు 
అదనంగా జీవించే కాలమౌతుంది. ఇది ఎలా 
అంటే 
అదే  మన మునులు చేసే తపస్సు. 
సరే ఇదంతా పక్కన పెట్టి మరికొన్ని 
విషయాలను తెలుసుకుందాం.
మనం శ్వాస తీసుకున్నపుడు మన నాసిక
రెండు రంధ్రాల గుండా గాలి వెళ్ళదు గమనించారా?
కుడి వైపు రంధ్రం గుండా వెళ్ళి వచ్చే గాలిని
సూర్యనాడి అని, ఎడమవైపు రంధ్రలో గుండా వెళ్ళి
వచ్చే గాలిని చంద్రనాడి అని అంటారు. ఒక ముక్కు 
రంధ్రంలోనుండి మరో ముక్కు రంధ్రంలోకి శ్వాస మారే 
సమయంలో రెండు ముక్కు రంధ్రాల్లో కొద్దిసేపు మాత్రమే
శ్వాస ఆడుతుంది. 
(ఈ వ్యాసంలోని అంశం అందరికి నచ్చినట్లయిన
మీరు పంపే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు 
సాగాలని ఇక్కడ ఆపుతున్నాను పాఠకులు పాహితీమిత్రులు
దీన్ని కొనసాగించ వలసినదిగాను దీనితో మీ అభిప్రాయం
తెలపండి కొనసాగించే ప్రయత్నం చేస్తాను.)

No comments:

Post a Comment