శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ
సాహితీమిత్రులారా!
ఒక కవి ఈ విధంగా వాపోతున్నాడట
ఆ శ్లోకం చూడండి ఎంత చమత్కారంగా ఉందో
ఇతర పాపఫలాని యథేచ్ఛయా
విలిఖితాని సహే చతురానన
అరసికేషు కవిత్వనివేదనం
శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ
ఓ బ్రహ్మదేవుడా !
నా నుదుటన ఇతరములైన ఎన్ని
పాపఫలాలైనా వ్రాసినా రాసుకో
రసికుడు కాని వాని దగ్గరికి
వెళ్ళి కవిత్వం చెప్పవలసిన
పరిస్థితిని మాత్రం నా నుదుట
వ్రాయవద్దు వ్రాయవద్దు వ్రాయవద్దు
అంటే రసికత్వం లేని వాని దగ్గర కవిత్వం చెప్పకూడదన్నది
లోకంలోని నానుడు దీన్నే కవి ఈ విధంగా చమత్కరించాడు
No comments:
Post a Comment