Friday, May 11, 2018

పుంస్త్వం బేల పో పోఁచకా


పుంస్త్వం బేల పో పోఁచకా




సాహితీమిత్రులారా!


మహాకవి శ్రీనాథుని చాటువులు ఎన్ని విన్నా
మళ్ళీ మళ్ళీ  వినాలనిపించేవి తక్కువేమీకాదు
ఈ చాటువు చూడండి-
పురుషత్వం దేనికి ఒక బోగముస్త్రీగా పుట్టించి వుంటే
బాగుండేదని చమత్కరించారు

కవితల్ సెప్పినఁ, బాడ నేర్చిన, వృధా కష్టంబె, యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు? పుంస్త్వం బేల పో పోఁచకా?
సవరంగా సొగ సిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టింతువే
నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా?

ఓ దైవమా! కవిత్వం చెప్పడం, సంగీతం పాడటం,
ఇవన్నీ వృథా కష్టమేకదా ఈ దేశంలో బోగపుస్త్రీలే
కదా భాగ్యశాలినులు పురుషత్వం దేనికి సరైన సొగసిచ్చి,
మంచి యువతి వేషం ఇచ్చి పుట్టిస్తే ఏవరైనా మెచ్చి
ధనం ఇచ్చిపోరా అని చమత్కరిస్తున్నాడు - శ్రీనాథుడు.

No comments:

Post a Comment