శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........
66. మిథిలా నగరానికి వెళుతూ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు
ఏ నది తీరంలో రాత్రికి నిద్రించారు?
- శోణానది
67. శోణనదిని ఇప్పుడు ఏమంటున్నాము?
- సోన్ నది
68. శోణనదికి మరోపేరు-?
-మాగధి
69. మాగధి పేరు మీద ఏర్పడినదేశం-?
- మగధ దేశం
70. మగధదేశ రాజధాని?
- గిరివ్రజ పురం
71. కుశుడు - ఎవరి కుమారుడు?
- బ్రహ్మమానస పుత్రుడు
72. కుశునికి విదర్భరాజకన్యకు పుట్టినవారు?
- కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు
73. కుశనాభుడు, ఘృతాచి అనే అప్సరసకు పుట్టిని నూరుగురు
ఆడపిల్లలు తమను మోహించిన వాయుదేవునితో ఏమన్నారు?
- మేము స్వతంత్రలంకాదు, మేము మానాన్న కూతుళ్లం.
74. కుశనాభుని కుమార్తెలను వాయుదేవుడు ఏమని శపించాడు?
- మఱుగుజ్జులై పొమ్మని శపించాడు.
75. కుశనాభుని కుమార్తెలు మఱుగుజ్జులైన ప్రదేశానికి పేరు?
- కన్యాకుబ్జము(కనౌజ్)
75. కుశనాభుని కుమార్తె కుబ్జత్వం ఎలా పోయింది?
- వీరిని పెండ్లాడదలచి బ్రహ్మదత్తుడనే కాంపిల్య నగరరాజు
వారి చేయిని పట్టుకోగానే వారి కుబ్జత్వం పోయింది.
76. కుశనాభుని కుమారుడెవరు?
- గాధిరాజు
77. గాధిరాజు కుమార్తె ఎవరు?
- సత్యవతి
78. సత్యవతి భర్త -?
- ఋచీక మహర్షి
79. సత్యవతికి మరోపేరు ?
- కౌశికి
80. కౌశికి తమ్ముడు-?
- విశ్వామిత్రుడు
No comments:
Post a Comment