Friday, October 20, 2017

స్నానాలు - స్నానోదకాలు


స్నానాలు - స్నానోదకాలు




సాహితీమిత్రులారా!


స్నానం అంటే మనం ప్రతినిత్యం చేసేదేకదా
అవును కానీ దీనిలో రకాలున్నాయట-
తలస్నానం, కంఠస్నానం అవేకదా
అవి మనకు తెలిసినవి కాని మనకు తెలియనివి
ఉన్నాయి వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం

శాస్త్రాలల్లో స్నానాలు పంచ, దశ, సప్తవిధాలని 
తెలిపియున్నారు మన పెద్దలు.

స్నానాని పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః.......
అని అంటే స్నానం 5 రకాలని అవి-

1. ఆగ్నేయస్నానం
   విభూతిని శరీరమంతా పూసుకోవడం

2. వారుణ స్నానం
   బొడ్డులోతు నీటిలో మూడుసార్లు మునగడం వారుణ స్నానం 

3. బ్రాహ్మ్య స్నానం
   ఆపోహిష్టామ యోభువఃతాన ఊర్జే దధాతన....
       అనే మంత్రం చదువుతూ స్నానం చేయడం

4. వాయవ్య స్నానం
   గోధూళి శరీరం మీద వేసుకోవడం

5. దివ్య స్నానం
   ఎండ కాస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఆ నీటిలో తడవడం

ఇవి ఆంధ్రవేద పరిభాష అనే గ్రంథంలో చెప్పబడినవి.
అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదసార రత్నావళిలో
దశవిధ, సప్తవిధ స్నానాలగురించి వివరించారు.

పై చెప్పిన 5 విధాలకు మరికొన్ని చేర్చారు ఇక్కడ
వారుణం, ఆగ్నేయం, వాయవ్యం, బ్రహ్మం, కాపిలం, మానసం,
దివ్యం అని ఏడు విధాలు

పైన చెప్పనివి కాపిలం, మానసం అనేవి రెండురకాలు

కాపిలం స్నానం -
నాభిస్థానానికి దిగువ నీటితో ప్రక్షాళన చేసికొని
శరీరం పైభాగాన్ని తడిబట్టతో తుడుచుకోవటం

మానస స్నానం
మనసులో విష్ణుస్మరణ చేసుకోవటం మానస స్నానం

పది స్నానాలు-

భస్మ గోమయ, ఘృ, ద్వారి, పంచగవ్యైస్తతః పరం
గోమూత్రం, క్షీరం, సర్పిః, మశోదకం .....
అనే శ్లోకం పదివిధాలైన స్నానాలను చెబుతున్నది.
దీనిలోని ప్రతి స్నానానికి మంత్రాలున్నాయి. అవి
మనం ఇక్కడ వివరించుకోవడం లేదు.

స్నానం చేసే విధానంలో 5 అంగాలున్నాయట
అవిసంకల్పం, మార్జనం, వరుణసూక్త పఠనం,
అఘమర్షణం, స్నానాంగ తర్పణం అనేవి
స్నానాంగ పంచకాలు.

స్నానోదకాలు-
స్నానం చేసేనీటిని కూడ మన శాస్త్రకారులు విభజించారు
అవి ఆరు విధాలు
మామూలుగా ప్రవహించే నీరు
ప్రవహించని నీరు అని రెండురకాలు
తైత్తిరీయ అరణ్యకంలో దీనికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి.
1. నదులు, సెలయేర్ల నీరు
2. బావినీరు
3. తటాకాలనీరు
4. వర్షపునీరు
5. ఎక్కడనుండైనా కడవతో తెచ్చిన నీరు
6. నీటి బోదెలు/కాలువలు/నీటి కుంటలలోని నీరు

No comments:

Post a Comment