శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.............
106. గౌతముడు అహల్యను శిల కమ్మని శపించాడని
చెబుతున్న వారు-?
- వ్యాసుడు, కాళిదాసు, తెలుగులో భాస్కర రామాయణ
కర్తలు మొదలైనవారు.
(అంటే ఇది వాల్మీకి వ్రాయలేదు)
107. విశ్వామిత్రుని యాగం మొదలైన ఎన్ని రోజులకు ఆకాశం
చిల్లులు పడేంత మాయ మబ్బులూ, చూస్తుండగా ప్రవాహంలా
నెత్తురూ - ఒక్కసారిగా పడసాగాయి?
- 11వ పగలు రాగానే
108. రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఎంత మందిస్త్రీలకు
ముక్కు చెవులు కోశాడు?
- ముగ్గురు (తాటక, శూర్పణఖ, అయోముఖి)
109. రామాయణం ప్రతి కాండలోని 18 సర్గకు ప్రత్యేక విశేషం
ఉంది అంటారు వాటి వివరాలేవి?
- బాలకాండ 18వ సర్గలో -
రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం
అయోధ్యకాండ 18వ సర్గలో-
కైక దశరథుని వరాలడగటం
అరణ్యకాండ 18వ సర్గలో-
శూర్పణఖ రావడం
కిష్కింధాకాండ 18వ సర్గలో-
వాలిసమాధానం
సుందరకాండ 18వ సర్గలో-
సీతమ్మను చూడటానికి రావణుడు రావడాన్ని
హనుమంతుడు స్వయంగా చూడడం.
యుద్ధకాండ 18వ సర్గలో-
విభీషణునికి రాముడు శరణునీయడం
ఉత్తరకాండ 18వ సర్గలో-
వేదవతి రావణుని శపించడం
110. తెలుగులో మొదటి రామాయణం-?
- గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం
111. గౌతముని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు కోడై కూసిన
దాన్ని వ్రాసిన కవి-?
గోన బుద్ధారెడ్డి
(ఇదీ వాల్మీకి రామాయణంలో లేదు)
112. వశిష్ఠుని వద్ద ఉన్న గోవుపేరు?
- శబల
113. విశ్వామిత్ర వశిష్ఠులకు మధ్య వివాదానికి కారణం-?
- శబలను విశ్వామిత్రునికి ఇవ్వకపోవటం
114. శబల విశ్వామిత్రుని నుండి ఎలా రక్షించుకొంది?
- శబల హూంకారం నుండి కాంభోజులు,
పొదుగు నుండి పహ్లవులు,
రోమాల నుండి మ్లేచ్ఛులు,
గోమయం నుండి శకులు,
యోని నుండి యవనులు
పుట్టి విశ్వామిత్రుని సేనల నుండి కాపాడాయి.
115. అహల్యాగౌతముల పెద్దకుమారుడు-?
- శతానందుడు
No comments:
Post a Comment