Sunday, October 29, 2017

జైనంలో కర్మ సిద్ధాంతం


జైనంలో కర్మ సిద్ధాంతం




సాహితీమిత్రులారా!


కర్మసిద్ధాంతం మన హిందూధర్మంలోనే 
కాక జైనమత సాంప్రదాయంలోనూ ఉంది. 
ఇది వారికి చాల ముఖ్యమైనది.
చేసిన కర్మలను బట్టి శుభాశుభ కర్మ ఫలాలను 
అనుభవించవలసి వస్తుంది. అదే జన్మలో కాకపోతే 
తరువాత జన్మలో అనుభవించాల్సి వస్తుంది. 
సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం తప్పదు.
సర్వజ్ఞులైన తీర్థంకరులకు ముందుగానే అన్నీ తెలియవచ్చు. 
కర్మలు -
ఘాటీయ కర్మలు(ఆత్మగుణాలను కలుషితం చేసే దుష్టకర్మలు), 
అఘాటీయకర్మలు అని రెండు విధాలు. 
ఆత్మకు సహజంగా సర్వజ్ఞత్వం, సర్వదర్శన శక్తి, పరమానందాన్ని 
అనుభవించే అవకాశం, సర్వశక్తిమంతత్వం ఉంటాయి. అయితే
ఘాటీయ కర్మలు ఆత్మకు అవి లేకుండా చేస్తాయి. 
అవి

1. జ్ఞానా వరణీయ కర్మ 
   ఆత్మకు సహజం ఉండే సర్వజ్ఞత్వ శక్తికి అడ్డువస్తుంది.

2. దర్శనావరణీయ కర్మ 
   దేనినైనా చూడగల శక్తికి ఇది ప్రతి బంధకం కలిగిస్తుంది.

3. మోహనీయ కర్మ 
   పరమానందాన్ని అనుభవించే 
   శక్తికి ఈ కర్మలు గుదిబండలు అవుతాయి.

4. అంత్రాయ కర్మ 
   ఇది ఆత్మ సర్వశక్తిమంతం కావడానికి ప్రతిబంధకం


అఘాటియ కర్మలు - 4

1. వేదనీయ కర్మ-
   కష్టసుఖాలనే భావనలను కలిగిస్తుంది

2. నామకర్మ -
   జన్మించినపుడు ఏ విధమైన శరీరాన్ని ధరించాలో నిర్ణయిస్తుంది.

3. ఆయుకర్మ-
   ఆత్మ ఏ దేహధారణ చేస్తుందో ఆ దేహ ఆయుర్దాయాన్ని   
   నిర్ణయిస్తుంది

4. గోత్ర కర్మ -
   ఏ అంతస్తు కుటుంబంలో జన్మించాలో నిర్ణయించే కర్మ


No comments:

Post a Comment