మదం అంటే ఏమిటి? - దాని విశేషాలు
సాహితీమిత్రులారా!
మదం అనే మాట తరచు వింటుంటాం
అంటే ఏమిటో?
"ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్ "
అంటుంటారు కదా!
మదం అంటే కొవ్వు, పొగరు అని చెప్పవచ్చు.
"శబ్దరత్నాకరం"(నిఘంటువు) ప్రకారం-
మదము - క్రొవ్వు, ఏనుగు క్రొవ్వు, రేతస్సు,
ఏనుగు రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషం
అనే అర్థాలున్నాయి.
ఇక్కడ మదం అనేది మూడు రకాలని త్రిమదములు
అవి - 1. అన్నమదం, 2. ధనమదం, 3. కులమదం
మరో రకంగా మదం 8 రకాలు అంటే అష్టమదములు
అవి - 1. అన్నమదం, 2. అర్థమదం, 3. స్త్రీ మదం
4. విద్యామదం, 5. కులమదం, 6. రూపమదం,
7. ఉద్యోగమదం, 8. యౌవన మదం.
ఇవి ఇలా ఉంటే
గజమదం అనేది ఏనుగుకు శరీరంలో ఎనిమిది
చోట్ల మదం(క్రొవ్వు/రేతస్సు) పుడుతుంది.
1. కన్నులలో పుట్టే మదం పేరు "సీధువు"
2. చెక్కిళ్ళలో పుట్టే మదం పేరు "దానం"
3. చెవులలో పుట్టే మదం పేరు "సాగరం"
4. తొండం చివరల పుట్టే మదం "శీకరం"
5. చనుమొనల వద్ద పుట్టే మదం పేరు "శిక్యం"
6. జననాంగాల వద్ద పుట్టే మదం పేరు "మదం"
7. గుండె సమీపంలో పుట్టే మదం పేరు "ఘర్మం"
8. కాళ్ళ వద్ద పుట్టే మదం పేరు "మేఘం"
ఏనుగుకు ఇన్నిరకాల మదాలున్నాయి.
ఈ విషయాలు యతులను గజారోహణం చేయించేవారికీ,
ఏనుగులపై విగ్రహాలను ఊరేగించేవారికీ తెలిసివుండాలి
అంటారు పెద్దలు.
No comments:
Post a Comment