దగ్ధ తిథి - వార - నక్షత్రాలు- లగ్నాలు
సాహితీమిత్రులారా!
మనం కొన్ని సందర్భాలలో
పనులు ప్రయాణాలు చేయకూడని
తిథి వారం నక్షత్రాలు
వింటుంటాం.
అవి ఏమిటో ఇక్కడ చూద్దాం-
దగ్ధ తిథులు-
వారం, తిథి రెండింటిని కలిపితే పదమూడు వచ్చిందంటే
అది దగ్ధతిథిగా గుర్తించాలి.
ఆదివారం(1) - ద్వాదశి(12) - కలిస్తే 13
సోమవారం(2) - ఏకాదశి(11) - కలిస్తే 13
మంగళవారం(3) - దశమి(10) - కలిస్తే 13
బుధవారం(4) - నవమి(9) - కలిస్తే 13
గురువారం(5) - అష్టమి(8) - కలిస్తే 13
శుక్రవారం (6) - సప్తమి(7) - కలిస్తే 13
శనివారం(7) - షష్ఠి(6) - కలిస్తే 13
ఇదేవిధంగా వీటిని మాసాలలో ఇవి
దగ్ధతిథులు-
మీన, ధనుర్మాసాలలో - విదియ,
వృషభ, కుంభమాసాలలో - చవితి,
మేష, కర్కాటకాలలో - అష్టమి,
వృశ్చిక, సింహ మాసాలలో - దశమి,
మకర, తులా మాసాలలో - ద్వాదశి
దగ్ధ నక్షత్రాలు-
ఆదివారం - భరణి
సోమవారం - చిత్ర,
మంగళవారం- ఉత్తరాషాఢ,
బుధవారం - ధనిష్ఠ,
గురువారం - ఉత్తర,
శుక్రవారం - జ్యేష్ఠ,
శనివారం - రేవతి.
దగ్ధ లగ్నాలు-
తదియలో - సింహ, మకరాలు
పాడ్యమిలో - తులా, మకరాలు,
పంచమిలో - కన్యా, మిథునాలు,
సప్తమిలో - కర్కాటక, ధనుస్సులు,
నవమిలో - సింహ వృశ్చికాలు,
ఏకాదశిలో - ధనుర్మీనాలు.
No comments:
Post a Comment