Sunday, October 1, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో -1


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో -1




సాహితీమిత్రులారా!


రామాయణం తెలియని భారతీయులు ఉండరు వారికి రామాయణం మళ్లీ
తెలియాలా అనే సందేహం రావచ్చు కానీ ఎంత తెలుసుకున్నా ఏవోకొన్ని మిగిలి ఉండేంత విస్తారమైనది రామాయణం. ఎంత మందికవులు తమకలాలను రామకథకోసం కదిలించలేదు. అలాగే దేశంలోని అన్ని రామాయణాలను అందరూ చదవలేదు కదా
నాకు తెలిసినంత మన పాఠకమిత్రులు సాహితీమిత్రులకు అందించాలనే తపనతో నా చిరుప్రయత్నం-

1. రామాయణం మొదటిగా వ్రాసింది-
   - సంస్కృతంలో వాల్మీకి

2. అందులో ఎన్ని కాండలున్నాయి
   - ఏడు

3. కాండలు అంటే - 
   - రామాయణంలోని విభాగాలు

4. కాండము అంటే- నానార్థాలు
   - దీనికి అనే అర్థాలున్నాయి
     1. కావ్యవిభాగము లేక సమూహము
     2. బాణము, 3. జలము, 
     4. ఆకు మొదలైన వాటి ఈనె
     5. తామర మొదలైన వాటి తూడు(కాఁడ)
     6. వరి మొదలైన వాటి పోఁచ
     7. ముండ్లు మొదలైన వాని దుబ్బు
     8. మోదుగు మొదలైన వాని కఱ్ఱ
     9. చెట్టు బోదె
     10. గుఱ్ఱము, (కుత్సితము)
     11. ఏకాంతము, 12. సమయము

5. రామాయణంలోని కాండల పేర్లు -
   1. బాలకాండ, 2. అయోధ్యకాండ, 3. అరణ్యకాండ,
   4. కిష్కిందకాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ,
   7. ఉత్తరకాండ.

6. వాల్మీకి ఏనది ఒడ్డున తపస్సు చేసేవాడు
   - తమసానది

7. శ్లోకం దేన్నిండి పుట్టింది
   - శోకం

8. సంస్కృత కావ్య చరిత్రలో మొదటి శ్లోకం-
   మానిషాద ప్రతిష్ఠాంత్వ
   మగమః శాశ్వతీః సమాః
   యత్ క్రౌంచమిథునాదేకమ్
   అవధీః కామమోహితమ్

9. మానిషాద - అనే శ్లోకం ఏ ఛందస్సులో ఉంది
   - అనుష్టుప్

10. రామాయణం వాల్మీకి ఎవరి ఆదేశానుసారం వ్రాశాడు
    - బ్రహ్మ

11. ఏ పక్షుల జంటలోని పక్షిని వేటగాడు ఒక పక్షిని కూల్చాడు
    - క్రౌంచ పక్షుల జంట

12. ఏ పక్షిని వేటగాడు కొట్టాడు
    - మగ పక్షిని

13. కోసల దేశం ఏ నది ఒడ్డున ఉంది
    - సరయూనది

14. కోసల దేశానికి రాజధాని ఏది
    - అయోధ్యా నగరం

15. అయోధ్య అంటే -
    - యోధులు జయించ శక్యంకానిది.

16. అయోధ్యను పాలించే దశరథుడు ఏ వంశం వాడు
   - సూర్యవంశం వాడు

17. దశరథుని తల్లిదండ్రులు ఎవరు
    - తండ్రి అజుడు, తల్లి ఇందుమతి

18. దశరథుని భార్యలెందరు వారి పేర్లు
    - ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి

19. దశరథునితో పుత్రకామేష్ఠి యాగం చేయించినది
    - ఋష్యశృంగుడు

20. ఋష్యశృంగుని తండ్రిపేరు-
    - విభాండకుడు అనే ఋషి


No comments:

Post a Comment