Monday, October 2, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........




21. దశరధుని పెంపుడు కుమార్తె ?-
    - శాంత

22. శాంత ఎవరెవరి వద్ద పెరిగింది?
    - దశరథుడు, రోమపాదుడు(అంగదేశాధిపతి)

23. శాంత ఎవరి కుమార్తె
    - సురభి అనే కామథేనువు అనుగ్రహం వల్ల
      దశరథునికి, రోమపాదునికి పెంపుడు కుమార్తె అయింది.

24. శాంత ఎవరి భార్య ?
    - ఋష్యశృంగుని భార్య

25. కౌసల్య తండ్రిపేరు?
      - భానుమంతుడు

26. సుమిత్ర తండ్రి ఎవరు?
      - మగధాధీశుడు

26. కైకేయి తండ్రి పేరు?
    - కేకయరాజు

27. వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్నఏమిటి
     - ఓమహర్షీ! విష్ణులోకం నుండి సర్వలోకాలూ సంచరించే
      బ్రహ్మమానసపుత్రుడివికదా నువ్వు సద్గుణాలూ, పరాక్రమమూ, 
      సత్యవ్రతమూ, సమర్థతా, ధైర్యమూ, సచ్చరిత్రమూ,
      పట్టుదలా, అన్ని భూతముల యందు ఇష్టమూ, 
      పాండిత్యమూ, కృతజ్ఞతాభావమూ, ధర్మబుద్ధీ, క్రోధాన్ని 
      జయించిన తనమూ, కాంతీ, అసూయలేని తనం కలవాడూ,
      కోపం వస్తే దేవతలనైనా భయపెట్టగలవాడూ, అందరికీ 
      ఇష్టుడూ ఎవరైనా ఉన్నారా (16 గుణాలు కలిగినవాడు)

28. వాల్మీకి ప్రశ్నకు నారదుని సమాధానం
     - ఈ 16 గుణాలున్నవాడు శ్రీరామచంద్రుడు

29. ఈ 16 గుణాలూ పరశురాముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, 
     భరద్వాజులలో ఉన్నాయికదా - అనే ప్రశ్నకు నారదుని    
     సమాధానం-
    - తెలుసుకొని చెబుతాన్నాడు.
     (పరశురాముడు - కోపం జయించలేదు
     విశ్వామిత్రుడు - తపస్సులలో భ్రష్టుడై, ఆత్మవిమర్శ 
     చేసుకొన్నవాడు
     వశిష్ఠుడు - యుద్ధంలో పరాక్రమాన్ని చూపలేడు.
     భరద్వాజుడు - దేవతలని భయపెట్టలేడు)

30. అశ్వమేధయాగంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి- ల పేర్లు?
    - (క్రమంగా)పట్టమహిషి, పరివృత్త, వావాత

31. అశ్వమేధంతో పాటు జరిగిన క్రతువులు-
    - అగ్నిష్టోమం, 2 అతిరాత్రాలు, అభిజిత్, 
      విశ్వజిత్, 2ఆప్తోర్యామాలు

32. యాగం చేయించే పురోహితులు ఎన్ని విధాలు?
    - హోత, అధ్వరు, బ్రహ్మ, ఉద్గాత 
      అని నాలుగువిధాలు

33. హవిస్సు అంటే?-
    - మంత్రపూర్వకంగా అగ్నిలోవేసే నేయి.

34. యజ్ఞపురుడు ఇచ్చిన పాయసాన్ని దశరథున్ భార్యలు
      తీసుకున్న విధానం?-
    - కౌసల్య సగభాగం, 
      సుమిత్ర  ఒక నాలుగవభాగం, 
               ఒక ఎనిమిదవ భాగం, 
      కైకేయి ఎనిమిదవ భాగం.

35. దశరథ తనయులు పుట్టిన రోజులు-
    - కౌసల్య పుత్రుడు 
      రాముడు - చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, 
                గురువారం మధ్యాహ్నం
      కైకేయి పుత్రుడు
      భరతుడు - పుష్యమీ నక్షత్రం, దశమి తిథి
     
      సుమిత్రా పుత్రులు
      శత్రుఘ్న, లక్ష్మణులు - ఆశ్లేష నక్షత్రం, దశమి తిథి

      

No comments:

Post a Comment