Tuesday, April 4, 2017

తనువు ఉన్నంతకాలం ఉండేది ఏది?


తనువు ఉన్నంతకాలం ఉండేది ఏది?




సాహితీమిత్రులారా!


ఈ సుభాషితము చూడండి-

ఒక్కక్షణము గ్రహావేశముండునేమొ
ఒక్కక్షణము సురామదముండునేమొ
గాని, లక్ష్మీమదంబు మూర్ఖప్రజలకుఁ
దనువు గలయంత కాలముఁ దనరుచుండు
                                               (సుభాషితరత్నమాల - 52)

కోపం వస్తే ఒక్కక్షణం ఉంటుందేమో
సురాపానం చేస్తే దాని మత్తుకూడ
ఒక క్షణకాలం ఉంటుందేమొ
కానీ మూర్ఖులైన వారికి పట్టిన
ధనమదం శరీరం ఉన్నంతదాక
ఉంటుంది కానీ మధ్యలో పోదు -
 అని భావం.

ఉపమాలంకార విశేషాలు -6


ఉపమాలంకార విశేషాలు -6




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి....





17. దృష్టాంతము -
ఆకాశమునందు చంద్రుడు భూమిపై నీ ముఖము

18. నిదర్శనము -
నీముఖము చంద్రకాంతి వహించుచున్నది.

19. వ్యతిరేకము -
నీ నిష్కళంకముఖము చంద్రుని మించెను.

20. సహోక్తి - 
నీ ముఖముతో గలసి రాత్రి చంద్రుడు శోభించును.

21. సమానోక్తి -
నీ ముఖము స్మితచంద్రికలతో తిలక కళంకముతో శోభిల్లుచున్నది

22. శ్లేష - 
నీ ముఖము అబ్జతుల్యము.
(అబ్జ - అప్ - నీరు, జ - పుట్టినది
  నీటియందు పుట్టినది - చంద్రుడుి, పద్మము.)

23. అప్రస్తుత ప్రశంస-
నీముఖము ఎదుట చంద్రుడు వెలవెలబారుచున్నాడు



Monday, April 3, 2017

ఏ దోషము లేనివారెవరు?


ఏ దోషము లేనివారెవరు?




సాహితీమిత్రులారా!


ఈ ప్రపంచంలో ఏ తప్పులేని
వారెవరైనా ఉన్నారా అంటే
సమాధానం దొరకటం కష్టమే

ఈ సుభాషితం చూడండి-

నిలువెల్ల నేత్రముల్ గలవాఁడు శక్రుండు,
        చంద్రుండు మలినాంకు సంయుతుడు,
వ్రజకులమందు నుద్భమయ్యెఁ జక్రహ
        స్తుఁడు, వసిష్ఠుఁడు పణ్య సుదతికొడుకు,
తనుహీనభూతమై తనరు రతీశుండు,
        వైశ్వానరుఁడు సర్వభక్షకుండు
కైవర్తకులసతీ గర్భజాతుఁడు వ్యాసుఁ,
         డంభోధి కడులవణాన్వితంబు,
శవసమూహాస్థిధరుఁడల శంకరుండు
బహుజనకులకుఁ బొడమిరి పాండు సుతులు
ముజ్జగంబుల నేదోషముం బొరయని
యాతఁడొకఁడేని లేఁడు లేఁడరసిచూడ
                                       (సుభాషిత రత్నమాల - 103)

నీలువెల్లా కండ్లున్నవాడు ఇంద్రుడు
- దేవతలకు రాజు

మచ్చగుర్తుతో కూడినవాడు చంద్రుడు
-రాత్రికి రాజు

గొల్లకులంలో పుట్టినవాడు కృష్ణుడు
- జగద్గురువు

వెలయాలికి పుట్టినవాడు వసిష్ఠుడు
- సప్తర్షులలో ఒకడు

శరీరమేలేనివాడు మన్మథుడు
- రతిరాజు (ప్రేమకే రాజు)

అన్నిటినీ తినేవాడు అగ్ని(వైశ్వానరుడు)
- అతిశుచికరమైనవాడు పునీతుడు

బెస్తకులము పడతికి పుట్టినవాడు వ్యాసుడు
- నారాయణుడు, శంకరుల తరువాతి గురువు

సముద్రమో ఉప్పుతో కూడినది
- గొప్పవాడు
ఎముకలను మాలగా తాల్చువాడు శివుడు
- శుభంకరుడు శంకరుడు

అనేకులైన తండ్రులుగలవారు పాండవులు
- ధర్మాత్మలు

ఇటువంటివారికే దోషాలుంటే

ఈ మూడు లోకాలలో ఏ దోషం లేనివారు ఎవరు
వెదకి చూచినా లేరుగాక లేరు

ఉపమాలంకార విశేషాలు - 5


ఉపమాలంకార విశేషాలు - 5 




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి....



11. అపహ్నుతి -
ఇది నీ ముఖముగాదు చంద్రుడే

12. ఉత్ప్రేక్ష -
ఇది చంద్రుడుకాబోలు

13. అతిశయోక్తి -
ఇది చంద్రుడే

14. తుల్యయోగిత -
నీ ముఖముచే చంద్రకమలములు జయింపబడెను

15. దీపకము -
రాత్రులందు చంద్రుడును, నీ ముఖమును ప్రకాశించుచుండును.

16. ప్రతివస్తూపమ -
నీముఖమునందే నేను ఆనందము ననుభవితును.
చంద్రునియందే చకోరములు ఆనందము ననుభవించును.



Sunday, April 2, 2017

కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు.


కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు.


సాహితీమిత్రులారా!



మహాభారత యుద్ధం నేటి హర్యానా 
రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరిగింది
ఇది 500 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో
జరిగిన అతిభీకరమైన యుద్ధం.
ఇందులోని మొత్తం సైన్యం 11 అక్షౌహిణులు 
అందులో 
పాండవులకు 7 అక్షౌహిణిలు
కౌరవులకు 11 అక్షౌహిణులు
మొత్తం యుద్ధం - 18 రోజులు జరిగింది
ఇందులో కౌరవుల సేనానులు 5 మంది మారారు
మొదటి పదిరోజులు భీష్ముడు
తరువాత 5రోజులు ద్రోణుడు
తరువాత 2 రోజులు కర్ణుడు
చివరిగా  1 రోజు శల్యుడు
సైన్యానికి సారధ్యం వహించారు
అయితే ఇందులో ఇక్కడ మనం వ్యూహాలను కొన్నిటిని

గమనించుకుందాము.
అభిమన్యుడు అనగానే మనకు 
గుర్తుకువచ్చేది పద్మవ్యూహం
ఇలాంటి వ్యూహాలు భారతంలో చాలా
పన్నారు అవేమిటో మనకు అంతగా తెలియవు
వాటిని గురించి ఇక్కడ చూద్దాం- 
రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో 
తమ సైన్యాలను నిలిపేవారు. 
అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..
1. క్రౌంచారుణ వ్యూహం : 
      పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి 
      ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2.   మహా వ్యూహం : 
      భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి 
      అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.
3. గరుడ వ్యూహం : 
    యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి 
    ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. 
     దీనినే సుపర్ణ వ్యూహం అని కూడా అంటారు.
4. అర్ధచంద్ర వ్యూహం : 
     మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి 
     ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు
5. వ్యాల వ్యూహం : 
      నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న 
     పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం.
     ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.
5. మకర వ్యూహం : 
     ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి 
     మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో 
     చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.

6. శ్యేన వ్యూహం: 
    ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా 
    దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. 
    ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.
6. సూచీ ముఖ వ్యూహం : 
      ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను 
      మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను 
      క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు 
      భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి 
      సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

7. మండల వ్యూహం : 
      ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో 
       వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.
8.    వజ్ర వ్యూహం :
       ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల 
       వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను 
       వజ్ర వ్యూహంలో రచిస్తాడు.
8. శృంగాటక వ్యూహం: 
     ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా 
     దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి 
     త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.
9.   సర్వతోభద్ర వ్యూహం : 
      తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని 
      సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.
10.  శకట వ్యూహం : 
     మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు 
     బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని 
     నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.
     
 11  మండలార్ధ వ్యూహం : 
          పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి 
          ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి 
          పాండవ సేనను నిలుపుతాడు.
12. చక్ర వ్యూహం : 
     పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. 
     దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో 
     సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ 
      సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా 
      బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.

13. బార్హస్పత్య వ్యూహం : 
     పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో 
     కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.


Saturday, April 1, 2017

ఉపమాలంకార విశేషాలు - 4


ఉపమాలంకార విశేషాలు - 4


సాహితీమిత్రులారా~


దండి వివరించిన
ఉపమాలంకార రూపాలను చూశాము.
ఇక్కడ అప్పయ్యదీక్షితులవారి
ఉపమ ఆహార్యభేదాలను చూద్దాం.


1.ఉపమ - 
ముఖము చంద్రునివలె నున్నది

2. ఉపమేయోపమ -
ముఖము చంద్రునివలె నున్నది
చంద్రుడు ముఖమువలె నున్నాడు

3. అనన్వయము-
ముఖము ముఖమువలె నున్నది

4. ప్రతీపము -
చంద్రుడు ముఖమువలె నున్నాడు

5. స్మరణము-
చంద్రునిఁజూడ ప్రియాముఖము జ్ఞప్తికి వచ్చెను.

6. రూపకము -
ముఖమే చంద్రుడు

7. పరిణామము-
ముఖచంద్రునిచే తాపము శమించును.

8. సందేహము -
ఇది ముఖమా?  చంద్రుడా?

9. భ్రాంతిమంతము -
చంద్రుడని చకోరములు నీ ముఖము వైపుకు పరుగులిడుచున్నవి.

10. ఉల్లేఖము -
చంద్రుడని చకోరములు, కమలములని తుమ్మెదలు 
నీముఖమును ఆశించుచున్నవి.


చెడనిది పద్యం ఒకటే


చెడనిది పద్యం ఒకటే




సాహితీమిత్రులారా!




ప్రపంచంలో అన్నీ నశించిపోతాయట
కాని పద్యం ఒకటి నిలిచి ఉంటుందని
ఒక పద్యం ఉంది-
గువ్వల చెన్న అనే మకుటంతో వ్రాయబడింది
అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఇక్కడ
మాట్లాడుకుంటున్నాము.

గుడికూలును, నుయిపూడును
వడినీళ్ళకు చెరువుతెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడియెడమల కీర్తిగన్న గువ్వలచెన్నా!

ఇటు అటు అనక అన్ని దిక్కలా దానధర్మాలతో
కీర్తిని వ్యాపింప చేసుకొన్న చెన్నప్పగారూ
సప్తసంతానాలతో సంబరపడాలని, దాతలెందరో
గుళ్ళను, గోపురాలను, నూతులను, చెరువులను,
ఉద్యానవనాలనూ నిర్మించి ఖ్యాతిని గడిస్తారు
కాని, ఇవన్నీ కొద్దికాల మాత్రమే నాశనమౌతాయి తరువాత
బాగుచేయించేవారుండరు ఉండినా అవి సరిగా ఉండవు.
ఇక చెడనిది అంటూ ఉన్నది ఒకటే అది సత్కవి చెప్పిన పద్యం
కాబట్టి అలాంటి చమత్కృతితోడి వ్రాసిన కవులను పండితులను
ఆదరించు కావ్యాలను అంకితం తీసుకో, వాటిని ముద్రణ
వేయించటానికి సహాయం చేయి దానివల్ల దాతల కీర్తి లోకంలో
వివిధస్థాయిలలో నిలబడుతుంది - అంటున్నాడు కవి