పార్వతీదేవి ప్రక్కకు తిరిగి ఎందుకు నవ్వింది?
సాహితీమిత్రులారా!
అక్బర్ బాద్షా - కవి గంగ్ ల వినోదం గురించి తెలుసుికుందాం -
ఒక సాయంత్రం అక్బర్ బాద్షా మరియు కవిరాజ్ గంగ్ విహరిస్తూ నదీ తీరాన ఉన్న ఒక శివాలయానికి చేరుకున్నారు. అక్కడ శివాలయంలోని పార్వతీదేవి విగ్రహాన్ని బాద్షా నిశితంగా పరిశీలించాడు. ఆ విగ్రహం శివుని వైపు కాస్త ముఖం పక్కకు తిప్పి, నవ్వుతున్నట్లుగా చెక్కబడి ఉంది (అది శిల్పి యొక్క నైపుణ్య.
అప్పుడు బాద్షా కవిరాజ్‌ను చూసి — "కవీ! పార్వతీదేవి శివుడి వైపు ముఖం వంకరగా తిప్పి ఎందుకు నవ్వుతోంది?" అని అడిగాడు. దానికి కవి గంగ్ సమయస్ఫూర్తితో ఈ కింది పద్యంతో సమాధానమిచ్చాడు.
"విభూతి చఢావత్ శంకర్ పే, అహిలోచన్ మంద్ పడీ ఝరకే |
వాకా సుసవాట్ ఉడ్యా శీర్ పే, జన్మ అమృత్ ఖుర్ద్ పడీ ఖసీ ||
నహి హతా భృగరాజ్ త్వచా, యా యోగీరాజ్ రహ్యో అటకే |
సురభీ సుత్ మోహన్ భాగ్ చఢ్యా 'జబ్ గౌరీ హసీ ముఖ్ యూం కర్ కే' ||"
పద్య వివరణ:
1.
ఒకసారి
పరమశివుడు తన శరీరానికి విభూతి (భస్మం) అలముకుంటున్నప్పుడు, అందులోని కొంత భస్మపు ధూళి ఆయన
మెడలో ఉన్న నాగుపాము (సర్పం) కంట్లో పడింది.
2. దానితో
ఆ నాగుపాము కోపంతో గట్టిగా బుస కొట్టింది. ఆ బుసలోంచి
వెలువడిన విషపు జ్వాల శివుని నుదుటిపై ఉన్న చంద్రుడికి తగిలింది.
3. చంద్రుడికి
విషపు సెగ తగలడంతో, ఆయన నుండి ఒక అమృత బిందువు జారి
శివుడి ఆసనమైన పులితోలు (వ్యాఘ్రచర్యం) మీద పడింది.
4. అమృత
బిందువు తగలగానే ఆ పులి సజీవమై గర్జించింది!
5. పులి
గర్జన వినగానే శివుడి వాహనమైన ఎద్దు (ఆంబోతు/సురభి సుత్) భయంతో పరుగు అందుకుంది.
6. శివుడి
చుట్టూ జరిగిన ఈ విచిత్ర సంఘటనల వరుసను (పాము బుస
కొట్టడం,
పులి
బ్రతకడం, ఎద్దు పారిపోవడం) చూసి
పార్వతీదేవి తల పక్కకు తిప్పి నవ్వింది!
ఈ చమత్కార వివరణ వినగానే అక్బర్ బాద్షా ఎంతో సంతోషించాడు.
No comments:
Post a Comment