Friday, January 17, 2020

శృంగార పంచకం


శృంగార పంచకం




సాహితామిత్రులారా!

సరిగ్గా 98 సంవత్సరాల క్రిందట
ఈ శృంగార పంచకం ముద్రించబడింది.
అంటే 1922వ సంవత్సరంలో.
అసలు శృంగార పంచకం అంటే ఏమిటి దానిలో
ఏదో శృంగారం అనే పదంతో కొంత అర్థమౌతోంది
కాని పూర్తి అర్థం కాలేదంటారా ఏమీలేదు శృంగారంతో
కూడిన 5(పంచకం) పుస్చకాలు. అందులో ఏమున్నాయి
అంటే.........
జాబులు ----- దీని కర్త - సెట్టి లక్ష్మీనరసింహ్వం
సరసోక్తి యుక్త కృష్ణశతకం  దీన్నీ లక్ష్మీనరసింహ్వం గారే
రసికాభిలాషం ---కర్త  కవిసార్వభౌమ శ్రీనాథుడు
సరసచాటువులు --- కర్త - సెట్టి లక్ష్మీనరసింహ్వం
పూర్వకవులు-చాటువులు

ఇవి ఇందులోని పుస్తకాలు.
ఇవి బూతుపుస్తాలుగా ముద్రవేసి
వీటిని జనాలకు దొరనంతగా దూరం చేశారు.
కానీ వీటిని చాటుమాటుగా మనవారు మద్యపాన నిషేధంలో
మద్యం తెచ్చుకున్నట్లుగా తెచ్చుకొని చదివేవారట. అవి ఎంతటి
రసికమైనవో ఎంతటి రసికుడవో తెలిసెరా అని పాటవుందికదా
అలా వాటిని చదివేవారని పెద్దలు చెబుతుంటారు. దొరికితే
సాహితీప్రియులు తప్పక చదవండి. కొన్ని పద్యాలు
దొరుకుతున్నాయని కొందరు పూర్తిపుస్తకాలే నెట్ లో
దొరుకుతున్నాయని కొందరు అంటున్నారు.
ఇదీ సమాచారం.

1 comment:

  1. ఇవి మన పందితమ్మన్యులు దాచుకొని చదువుకుంటున్నారు.

    కోరికలు తీర్చుకుంటున్నారు.

    ఈ జగత్తులో బలమైన శక్తి శృంగారమే.

    ఈ బూతు రచనల చదివితే చికు బుకు చికు బుకు రైలే.

    ReplyDelete