''నానీ'' కవితా ప్రక్రియ
సాహితీమిత్రులారా!
ఆచార్య ఎన్.గోపీ
తెలుగులో నాని కవితా ప్రక్రియ 1990 దశకం ఉత్తార్థంలోఊపందుకుంది. నానీ అనే పేరేంటి మనం చిన్నపిల్లల్ని
పిలిచినట్లు అంటే అలానే అనుకోవాలి.
ఉర్దూలో నన్హే అనే పదంనుంచి పుట్టిందంటారు
నన్హే అంటే చిన్నది అని. ముస్లిం ఇండ్లలో చిన్నపిల్లలను
న(న్హే)న్నే బచ్చే అని అంటుంటారు. మనం ఈకాలంలో
చిన్నపిల్లల్ని నానీ పిలువడం గమనిస్తూనే ఉన్నాం.
ఎన్. గోపీ నిజ ఆవేదన దుఃఖం నుంచే నానీ అనే
మినీ కవితలు గోరుముద్దల్లాగా బయలుదేరాయి.
నానీ పదంలో నా, నీ అనే అక్షరాలు నా ఆవేదన
నీ ఆవేదన అనే అర్థంకూడ వస్తుంది.
ఆచార్య ఎన్.గోపీ గారు సృష్టించిన ఈ కవితా రూపాన్ని
ఎందరో కవులు అనుసరిస్తూ కవితలు రాస్తున్నారు.
కొండను అద్దంలో చూపినట్టుగా గొప్ప అర్థాన్ని
20-24 అక్షరాల్లో ఇమిడ్చి చెప్పడమే నానీ.
ఇందులో నాలుగు మినీ పాదాలుంటాయి.
రెండేసి పాదాలకు భావాంశం ఉంటుంది.
మొదటి పాదానికి రెండో పాదం సమర్థకంగా ఉంటుంది.
ఉదాహరణ -
కుండ ముక్కలైందా
కుమిలిపోకు
మట్టి మరో రూపంకోసం
సిద్ధమౌతుంది
(గోపీగారి నానీ)
ఈ కవితా ప్రక్రియతో ఆనేకులు ప్రభావితులై పుస్తకాలు కూడా ప్రచురించారు.
ఇప్పుడు నానీ ప్రక్రియలో కవిత్వం వ్రాయడం
తెలియనికవులు లేరనటంలో అతిశయోక్తి కాదేమో!
నానీలు హైకూలు బాగుంటాయి.
ReplyDeleteబ్లాగ్ లోకం లో పైకూ ప్రక్రియ ఒక తీపి వంటకం ప్రవేశ పెట్టింది.
పైకూలు చదివినా విన్నా ఇక పై జన్మలు ఉండవు.
ReplyDeleteహైకూలవి బాగుండును!
పైకూలు జిలేబులనెడు పైత్యంబులతో
చాకుని దింపెడు వంటక
మై కాంతయొకతె బలాగు మామి గలదయా :)
జిలేబి
ReplyDeleteకలడొక అనానిమస్సూ
విలవిల లాడుచు తిరిగి కవితల వెనుక తా
విలపించు చుండు భోరను
చు లావుగ దొరలుచు! పేరు చుప్పాయి సుమీ :)
నారదా!
జిలేబి