తాటాకు బొమ్మలాట
సాహితీమిత్రులారా!
ఇది శ్రీశ్రీ వ్రాసిన కవిత
పోయెట్రీ వర్క్ షాప్ నుండి
తీసుకోవడం జరిగింది.
తాటాకు బొమ్మలాట
తాటాకు బొమ్మరింట దాగున్న సూరీడా!-
ఆరని కంటి నీరే
ఏరయి పారే వేళా
ఊగని ఉయ్యాలగా - నా
ఒడిలో నిదురపోరా!
తాటాకు బొమ్మరింట
దాగున్న సూరీడా!
నా చిట్టి సూరీడా!
జోలపాడే కన్నీరే ఈ
లోకాలె చీకటాయె ఆ
ఎండమావి అలగా జనం
గాయపడ్డ మా మనసే
ఆరని కొరివాయె
తూలిపడ్డ ప్రజలకే
కూడు నీడ కరువాయె
బీడు పడ్డ నేలమీద
వానచినుకు పడదాయె
అమ్మచేతి మందారం నా
అందమైన బంగారం
చెందామర చేరువైన
ముచ్చటైన మూలధనం
నీరులేని మేఘం వచ్చి
నెత్తురే చిందెనురా!
అన్నం లేని బాననిండా
కన్నీరే పొంగెనురా!
శ్రీ శ్రీ కూడా తవికలు వ్రాశాడు అని తెలుస్తోంది.
ReplyDelete