టెంకాయచిప్ప శతకము
సాహితీమిత్రులారా!
శతకాలు అనేకం వాటిలో టెంకాయచిప్ప శతకం ఆంధ్రవాల్మీకిగా పేరు గన్న, వాసుదాసుగా ప్రసిద్ధుడైన వావికొలను సుబ్బారావుగారు 06-04-1925తేదీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఎదుట చదువి శ్రీరామచంద్రులవారికి అర్పింపబడినది. ఇందులో 155 పద్యాలున్నాయి. ఇది ఎక్కువ భాగం తేటగీతులు మిగిలినవి కందపద్యాలు, ఒక్క ఉత్పలమాలతో కూర్చబడినది
అందులోని కొన్ని పద్యాలను ఇక్కడ గమనిద్దాం-
ఆంధ్రవాల్మీకి హస్తంబునందు నిలిచి
రూప్యములు వేనవేలుగఁ బ్రోగుచేసి
దమ్మడైనను వానిలో దాఁచుకొనక
ధరణిజాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప - 1
కలుగవే కోట్లకొలఁది టెంకాయ లవని
వానిలో నొక్కటైన నీవాసి గనెనె
నిచ్చ రామాబ్జ సన్నిధిని నిల్చి
మచ్చికను మచ్చరితమును ముచ్చటింపు - 2
చేతిదోడుగ నిన్నాళ్ళు చిప్పమిన్న
గ్రాలితివి నాకు, నింక నీ గాసిదీఱ
నిలుము రామపదాబ్జ సన్నిధిని సతము
నేను వచ్చెద వైళంబ నీకుఁ దోడు - 3
కాలినడకల నామడల్ లీలగాఁగ
నడచువేళల, నేలపై నడవులందు
మేను వ్రాల్చిన వేళఁ, గౌపీనమాత్ర
ధారినై తిర్గువేళ, నోనారికేళ
ఫలను, వినుఁబాయకుండుట నిలుపు మదిని - 4
వేలకొలదిని రూప్యముల్ విడిచి, శుష్క
తృణముగా నెంచి నామేడయిల్లువదలి
మేలి జలతారు వలువలు కాలఁదన్ని
నిన్ను గ్రహియించితిని గాదె నిమ్మిఁజిప్ప - 5
విడిచితి సర్వ ధనంబులు
విడిచితి భోగంబులెల్ల విషయసుఖంబుల్
విడిచితి నిల్లును భూమియ
విడువను గద నిన్ను నెట్టివేళలఁ జిప్పా - 6
ఈ విధంగా సరళమైన భాషతో మాట్లాడిన విధంగా
వ్రాయబడింది ఈ శతకం.
చిప్ప తవికలు నాకు పిచ్చ పిచ్చగా నచ్చాయి. అన్నీ కలిపి ప్రచురిం చండి. పారాయణ చేసుకుంటాము.
ReplyDeleteGoogle లో వెతకండి. ఉన్నది.
Deleteపైకూ జుజుబి గిద్యం కన్నా చిప్ప కవిత్వం మిన్న.
ReplyDelete